పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xi


సాయం చేస్తాడు. ధూళికణం కంటే చిన్న వాడినని ప్రాణి భావించినప్పుడే పరమాత్ముడు వచ్చి సహాయం చేస్తాడు. నిర్మలుడికి బలం రాముడే

ఈ సత్యం యింకా మనకు అర్థం కావలసిన అవసరం వున్నది. అందుకు దక్షిణాఫ్రికాలో జరిగిన .సత్యాగ్రహచరిత్ర మనకు బాగా ఉపయోగపడుతుందని విశ్వసిస్తున్నాను

ఇప్పుడు జరుగుతున్న పోరాటంలో ఏ ఏ అనుభవాలు మనకు కలుగుతున్నాయో, అవన్నీ దక్షిణాఫ్రికా సత్యాగ్రహంలో కలిగాయి మనదేశంలో సాగుతున్న సత్యాగ్రహసమరంలో నిరాశపడవలసిన అవసరమేమీ యింతవరకు మనకు కలుగలేదని దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర చెబుతున్నది మన ప్రణాళికపై గట్టిగా నిలబడివుంటే విజయం మనకు లభించి తీరుతుంరని స్పష్టంగా బోధపడుతుంది

ఈ ప్రస్తావన నేను జుహూలో వ్రాస్తున్నాను. దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్రయందలి మొదటి 30 ప్రకరణాలు యరవాడ జైలులో వున్నప్పుడు వ్రాశాను నేను చెబుతూ వుంటే సోదరుడు ఇందూలాల్ యాజ్ఞక్ వ్రాశారు మిగతా ప్రకరణాలు యిక ముందు వ్రాయగలనని భావిస్తున్నాను జైల్లో ఆధారంగా నాకు సహాయ పడే గ్రంధాలు ఏమీ లేవు యిప్పుడు కూడా అట్టి గ్రంధాలు ప్రోగు చేయాలని నేను భావించడం లేదు. సవివరంగా చరిత్ర మొత్తం వ్రాయుటకు నాకు సమయంలేదు ఉత్సాహంగాని కోరికగాని లేదు యిప్పుడు మనం చేన్తున్న పోరాటానికి ఉపయోగపడాలని ఉత్సాహవంతులెవరైనా దక్షిణాఫ్రికాలో జరిగిన సత్యాగ్రహచరిత్రను సవివరంగా వ్రాయదలిస్తే వారికి సహాయ పడాలని భావించి యి చరిత్ర వ్రాస్తున్నాను ఏ ఆధారాలూ ఎదురుగా పెట్టు కొని నేను యీ చరిత్ర వ్రాయలేదు. కాని యింధు పేర్కొన్న ప్రతి ఘట్టం ప్రామాణికమేనని, యిందు ఒక్క అతిశయోక్తిగాని ఒక్క అనిశ్చితమైన విషయంగాని లేదని పాఠకులకు మనవిచేస్తున్నాను

జుహూ. బుధవారం

సంవత్ 1980 ఫాల్గుణ బహుళ 13

2 ఏప్రిల్ 1924

ఎం.కె. గాంధీ