పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ix


ఇక మూడోది చంపారన్ పోరాటం దానిది పెద్ద చరిత్ర. రాజేంద్రబాబు వ్రాశారు అక్కడ సత్యాగ్రహం చేయవలసివచ్చింది. అయితే వ్యతిరేక పక్షపు స్వార్ధం చాలా పెద్దది అక్కడ పేర్కొనవలసిన విషయం చంపారన్ ప్రజల్లో ఏర్పడిన పరిపూర్ణశాంతి తత్ఫలితంగా ఏండ్ల తరబడిగా అమల్లో వున్న ఒక చెడ్డ చట్టం రద్దు కావించుటకు ఆరు మాసాలు పట్టింది

అహమదాబాద్ మిల్లు కార్మికులది వాల్గవ పోరాటం ఆ చరిత్ర గుజరాతీయులకు కాకపోతే మరెవరికి తెలుస్తుంది? యీ సంగ్రామ సమయంలో కార్మికులు చూపించిన సహనం శాంతి అపూర్వం నాయకుల్ని గురించి ఎంతైనా చెప్పవచ్చు? అయినా ఆ విజయం దోషమయం అని ప్రకటించాను. అందుకు కారణం వున్నది. కార్మికులు పట్టినపట్టును నెగ్గించేందుకు నేను ఉపవాసం చేశాను ఆది మిల్లుయజమానులపై నేను చేసిన పత్తిడి అన్నమాట వాళ్లకు నాకు మధ్యమంచి స్నేహసంబంధంపున్నది ఆసంబంధంపై నా ఉపవాసం వల్ల వత్తిడి పెరిగింది. అయినా ఆ సంగ్రామం మరిచి పోరానిది కార్మికులు శాంతిగా తమ పట్టు మీద నిలబడి యుంటే వారి మాటనెగ్గేదే వాళ్లు మిల్లు యజమానుల మనస్సును జయించి యుండే వారే కాని కార్మికులు మిల్లు జయమానుల మనస్సును జయించలేక పోయారు పైకి కనబరచినంత శాంతంగా మనసావాచా కర్మణా వారు వ్యవహరించలేకపోవడమే అందుకు కారణం అయితే యీ సంగ్రామంలో వాళ్లు శారీరికంగా శాంతిగా వున్నారు. అది గొప్ప విషయమే

అయిదవ పోరాటం ఖేడాలో జరిగింది అక్కడి నాయకులంతా పరిశుద్ధంగా సత్యాన్ని ఆచరించారని నేను చెప్పలేను. శాంతిని మాత్రం రక్షించారు రైతులు వ్యవహరించిన శాంతి తీరు కూడా అహమదాబాదులో కార్మికులు వ్యవహరించిన తీరువంటిదేనని చెప్పక తప్పదు. అక్కడ మాకు గౌరవందక్కింది ప్రజల్లో జాగృతి వచ్చింది. ఖేడా ప్రజలు మాత్రం పూర్తి శాంతి స్వరూపాన్ని తెలుసుకోలేక పోయారు అహమదాబాదు యందలి కార్మికులు కూడా శాంతి యొక్క పరిశుద్ధస్వరూపాన్ని తెలుసుకోలేదు. అందువల్ల రౌలట్ ఆక్టుకు సంబంధించిన సత్యాగ్రహంలో ప్రజలు కష్టాలు అనుభవించవలసివచ్చింది