పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

86

బోయర్ యుద్ధం


సేవాకార్యక్రమం వల్ల ఎంతో గౌరవం భారతజాతికే లభించింది. యీ విషయాన్ని జనరల్ బులర్ తన పత్రాల్లో పేర్కొన్నాడు

జబ్బు పడ్డవాళ్లకు, గాయపడిన వాళ్లకు ఎలా సేవచేయాలో నేర్పిన డా॥ బూధ్ కూడా మెడికల్ సూపరింటెండెంటుగా మా దళం వెంటవున్నారు. వారు సహృదయులు మంచిపాదరీ వారు భారతీయ క్రైస్తవులతో బాటు పనిచేస్తూ వుండేవారు. అందరితో కలిసిమెలిసి వుండేవారు. నేను చెప్పిన 37 మంది భారతీయ నాయకుల్లో చాలా మంది వీరి శిష్యులే భారతీయుల అంబులెన్స్ దళం మాదిరిగా యూరోపియన్ల అంబులెన్స్ దళం కూడా తయారై కార్యరంగంలోకి దిగింది. రెండుదళాల కార్యక్రమం ఒకే చోట సాగింది

యుద్ధంలో సాయం చేస్తామని పంపిన మా పత్రంలో షరతులేమీ పెట్టలేదు. అయితే మా అనుమతి పత్రంలో ప్రభుత్వం, మీ దళంఫిరంగుల తుపాకుల గుండ్లు తగిలే స్థావరంలో పని చేయనక్కర లేదని పేర్కొన్నది అంటే అట్టి స్థావరంలో గాయపడి, పడిపోయిన సైనికుల శరీరాల్ని అక్కడ వుండి పనిచేసే అంబులెన్స్ దళం సభ్యులు వెంటనే ఎత్తుకొని కొంత దూరం వచ్చి వదిలి వెళితే మేము యిక ఆ శరీరాలను గురించి శ్రద్ధ వహిస్తామన్న మాట తాత్కాలికంగా ఏర్పడిన భారతీయులదళం, యూరోపియన్ల దళం రెండిటి సహకారం ప్రభుత్వానికి ఎందుకు అవసరమైందో తరువాత తెలిసింది లేడీస్మిథ్‌లో జరుగుతున్న సంగ్రామంలో జనరల్ హ్వైట్ చిక్కుకు పోయాడు అతణ్ణి రక్షించడానికి జనరల్ బులర్ పెద్ద ప్రయత్నం చేయవలసి వచ్చింది ఆ పోరులో యుద్ధస్థావరంలో పనిచేసే అంబులెన్స్ దళ సభ్యుల శక్తికి మించిన సైనికులు దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. యుద్ధం జరుగుతున్న చోటుకు, ఆసుపత్రికి మధ్యన రోడ్లు కూడా లేవు. దూరం కూడా ఎక్కువ గాయపడ్డ వాళ్లను గుర్రం బండ్ల మీద తీసుకుపోవడం అసంభవమై పోయింది. పెద్ద ఆసుపత్రులు రైలు స్టేషను దగ్గర, యుద్ధస్థావరానికి 8 నుంచి 25 మైళ్ల దూరాన ఉంటాయి. మేము వెంటనే పనికి దిగవలసి వచ్చింది అది మేము ఊహించిన దానికంటే కష్టమైన పని