పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

85


ప్రభుత్వానికి అనుమతి నొసంగమని జాబు వెళ్లింది. యితర జనాన్ని ప్రోగుచేసింది కూడా వారే యీ నాయకుల్లో బారిస్టర్లు వున్నారు. గుమాస్తాలు కూడా వున్నారు. మిగతా వారిలో తాపీ పనివాళ్లు. నేతపని వాళ్లు, తదితర చేతివృత్తుల వాళ్లువున్నారు. వారిలో హిందువులు మహమ్మదీయులు, మద్రాసీలు, ఉత్తర ప్రదేశ్ వాసులు, అన్ని మతాలవాళ్లు, అన్ని ప్రాంతాల వాళ్లు వున్నారు. అయితే భారతీయ వ్యాపారస్థులు మాత్రం ఎవ్వరూ అందులో చేరలేదు. కాని వారు ధనసహాయం బాగా చేశారు

ఇట్టి దళంలో చేరిన వారికి భత్తాలు లభిస్తాయి. అయితే యితర అవసరాలు వాళ్లకు చాలా వుంటాయి అ అవసరాలు కూడా తీరితే కఠోరంగా సాగే క్యాంపు జీవితంలో కొద్ది సదుపాయాలు లభిస్తాయన్నమాట ఆ అవసరాలు తీర్చడానికి భారత వ్యాపారస్థులు పూనుకున్నారు. గాయపడిన సైనికులకు మిరాయిలు, సిగరెట్లు వగైరా మేము యివ్వవలసివుంటుంది ఆ బాధ్యత కూడా వ్యాపారస్థులు వహించారు. పట్టణాల దగ్గర మాదళ సభ్యులు డేరాలు వేసుకొనవలసి వచ్చినప్పుడు అక్కడి భారత వ్యాపారులు తమ సహాయ సహకారాలు అందజేస్తూ వున్నారు. ఈ అంబులెన్స్ కోర్‌లో గిర్‌మిటియా కార్మికులు కూడా చేరారని తెలియజేశాను కదా వారి పనులు సరిచూచేందుకై వారితోబాటు వారి తెల్లజాతి సర్దార్లు కూడా వచ్చారు. అయితే చేయవలసిన పని అందరికీ సమానంగానే నిర్ణయించారు. అందరూ కలిసి మెలిసి వుండాలి గిర్‌మిటియా కార్మికులు మమ్మల్ని చూచి ఆనందపడిపోయారు. మొత్తం దళ వ్యవస్థ మాచేతికి వచ్చింది. అందువల్ల యీ అంబులెన్స్ దళం భారతజాతి కంతటికి ప్రతీకయని అందరూ భావించారు. వారి సేవాకార్యక్రమం వల్ల భారతజాతి గౌరవం ఇనుమడించింది కూడా అయితే నిజానికి గిర్‌మిటియా కార్మికుల చేరికకు సంబంధించిన గౌరవం భారత జాతికి లభించుటకు వీలులేదు. ఆ గౌరవం ఆ యా కార్మికులు పనిచేస్తున్న స్థావరాల యజమానులగు ఆంగ్లేయులకే దక్కాలి అయితే దళం తయారై కార్యరంగంలోకి దూకిన తరువాత దాని సువ్యవస్థిత