పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

87


గాయపడ్డ సైనికుల శరీరాల్ని ఎత్తుకొని 7 లేక 8 మైళ్ల దూరం నడిచివెళ్లడానికి మేము అలవాటు పడ్డాం కాని ప్రమాదకరంగా గాయపడ్డ సైనికులను ఆఫీసర్లను మోసుకొని 25 మైళ్ల దూరం నడవవలసిన పరిస్థితి ఏర్పడింది. త్రోవలో వాళ్లకు మందులు యివ్వాలి మా పని ఉదయం 8 గంటల నుంచి సాయం కాలం 5 గంటల దాకా సాగుతుంది. అప్పటికి ఆసుపత్రికి మేము చేరి తీరాలి యిది చాలా కష్టమైనపని ఒక రోజున మేము యీ విధంగా 25 మైళ్ల దూరం నడవవలసి వచ్చింది. అదీగాక యుద్ధ ప్రారంభంలో ఓటములను బ్రిటిష్ వాళ్లు చవిచూడవలసి వచ్చింది పెద్ద సంఖ్యలో తెల్లజాతి సైనికులు గాయపడ్డారు. అందువల్ల తుపాకీ ఫిరంగుల గుండ్లు వర్షించే చోట మమ్మల్ని వెళ్లవద్దని విధించిన తమ షరతును ఉపసంహరించుకోవలసి వచ్చింది. అయితే ఒక్క విషయం వ్రాయడం అవసరం అట్టిస్థితి వచ్చినప్పుడు మీకిచ్చిన అనుమతి పత్రం ప్రకారం మిమ్మల్ని ప్రమాదకరమైన స్థావరానికి పంపుటకు వీలులేదు గుండ్ల వర్షం కురిసే చోటుకు మీరు వెళ్లడానికి యిష్టపడకపోతే జనరల్ బులర్ మిమ్మల్ని బలవంత పెట్టరు. కాని మీరు స్వేచ్చగా అందుకు అంగీకరిస్తే ప్రభుత్వం మీ ఉపకారాన్ని మరిచిపోలేదు" అని మాకు చెప్పారు. మేము ప్రమాదాలకు సిద్ధపడే వున్నాం. ప్రమాద స్థావరానికి దూరంగా వుండాలనే కోరిక మాకు లేదు. అందువల్ల మేమంతా అందుకు సిద్ధపడ్డాం వెళ్లాం కాని మాకెవ్వరికీ ఒక్క గుండు తగలలేదు. చిన్న దెబ్బకూడా తగలలేదు

మా దళ సభ్యులకు ఎన్నో సుఖం కలిగించే అనుభవాలు కలిగాయి అయితే వాటన్నింటినీ యిక్కడ వివరించను గిర్‌మిటియా కార్మికులు కూడా గలమా అంబులెన్స్ దళ సభ్యులు, ఆంగ్లేయుల అంబులెన్స్ దళ సభ్యులు కలిసిమెలిసి పని చేయవలసిన అవసరం ఎన్నోసార్లు కలిగింది యుద్ధస్థావరంలో సైతం అంతా కలిసి మెలిసి పనిచేశాం ఒక్కచోట కూడా ఆంగ్లేయులు మమ్మల్ని అవమానించలేదు. హీనంగా చూడలేదు. ఎంతో సఖ్యతతో అందరం కలిసి పనిచేశాం ఆంగ్లేయుల తాత్కాలిక ఆంబులెన్స్ దళంలో చేరిన వారంతా దక్షిణాఫ్రికాలో నివసిస్తున్న వారే తాము ప్రమాదంలో