పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

84

బోయర్ యుద్ధం


ముందుకు ఉరికి వాళ్ల సైన్యాలు నేటాల్ రాజధానీ నగరంలోకి ప్రవేశించనున్నాయనే భయం ప్రభుత్వాన్ని పట్టుకున్నది. గాయపడిన వారి దేహాలు చచ్చిపోయినవారి శవాలు కుప్పతిప్పలుగా పడి వున్నాయి. మా కోరికను అంగీకరించమని అప్పటికీ మా ప్రయత్నం సాగుతూనే వున్నది చివరికి అంబులెన్స్‌కోర్ (గాయపడ్డవాళ్లను ఎత్తుకు రావరం, వాళ్లకు సేవ చేయడం పనిగాగలదళం) రూపంలో మాకు అనుమతి లభించింది. మా జాబులో ఆసుపత్రుల యందలి పాయిఖానా దొడ్లను శుభ్రం చేస్తామని ఆసుప్రతుల్ని ఊడ్చి, కడిగి శుభ్రం చేస్తామని కూడా వ్రాశాము అందువల్ల అంబులెన్స్‌కోర్ మాకు వచ్చింది. స్వతంత్ర భారతీయులు, గిర్‌మిట్ ప్రధనుంచి ముక్తి పొందిన భారతీయులు అందు చేరతామని జాబులో వ్రాశాము దానితో పాటు గిర్‌మిటియా కార్మికులను కూడా చేర్చుకొనుటకు అనుమతించమని కోరాము అప్పుడు ప్రభుత్వానికి ఎక్కువమంది జనం అవసరమైనారు కనుక ప్రభుత్వాధికారులు వెంటనే గిర్‌మిటియా కార్మికులు చాకిరీ చేస్తున్న తెల్లవారి భవనాలకు వెళ్లి గిర్‌మిటియా కూలీలను అప్పగించమని ప్రార్థించారు దానితో 1100 మంది భారతీయుల అంబులెన్స్ కోర్ ఏర్పడింది. యుద్ధరంగానికి దర్జాగా బయలు దేరి వెళ్లాము వెళ్లేముందు పాఠకులకు పరిచితుడైన, నేటాలు యందలి తెల్లజాతి వాలంటీర్ల దళానికి నాయకుడైన శ్రీ ఎస్కంబ్ గారిని కలిసి వారి ఆశీస్సులు పొందాము కృతజ్ఞతలు కూడా వారు మాకు తెలియజేశారు. ఆంగ్ల భాషా పత్రికల బుర్ర తిరిగిపోయింది. యిది వాటికి గొప్ప చమత్కారమనిపించింది భారతీయులు యీ యుద్ధంలో పాల్గొంటారని వాళ్లు ఊహించలేదు

ఒక ఆంగ్లేయుడు భారతీయుల్ని ప్రశంసిస్తూ ఒక కవితకూడా ఘనంగా వ్రాసి పత్రికలో ప్రచురించారు. “చివరికి మనమంతా ఒక సామ్రాజ్యం బాలకులమే" అనునది అతడి కవిత యొక్క పల్లవిభావం

ఈ దళంలో 300 లేక 400 మంది గిర్‌మిట్ ప్రధనుంచి ముక్తి పొందిన భారతీయులు వున్నారు. వీరంతా స్వతంత్ర భారతీయుల కృషివల్ల వచ్చి చేరారు. అందు 37 మంది నాయకులు వున్నారు. వారి సంతకాలతోనే