పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

83


అని వాళ్లు అనుకున్నారు. అసలు మనమాటకు విలువయిస్తారా? అదీగాక మనం భారతీయులం ఎన్నడూ యుద్ధంలో పాల్గొన లేదు. తుపాకీ చేత బట్టలేదు అని అంతా సందేహించారు. అయితే ఆయుధాలు చేపట్టకపోయినా, యుద్ధ రంగంలో చేయవలసిన పనులు యింకా చాలా వుంటాయి. వాటికి కూడా శిక్షణ అవసరం అడుగులో అడుగు వేస్తూ కదంత్రొక్కుతూ ఒక్క వరుసలో నడవడం కూడా మన వాళ్లకు తెలియదు. అంతేగాక సైనికులతో బాటు. పెద్ద మజిలీలు దాటడం, ఎవరి సామాను వాళ్లు మోసుకొని నడవటం కూడా మనకు కష్టమైన పనియే యింతే గాక తెల్లవాళ్లు మనల్ని 'కూలీ' అని పిలుస్తారు. అవమానిస్తారు. మనల్ని హీనంగా చూస్తారు. యిదంతా ఎలా సహించగలం? సైన్యంలో చేరతామని మనం కోరితే దాన్ని అంగీకరించేలా చేయడం సాధ్యమా? యీ పశ్నలన్నింటిని గురించి దీర్ఘంగా చర్చించి, ఏది ఏమైనా మన కృషి మనం తప్పక చేయవలసిందే అనునిర్ణయానికి వచ్చాము పనిచేయడం ప్రారంభిస్తే అదే యింకా పని చేయడాన్ని నేర్పుతుంది. మనకు సేవ చేయాలనే కోరిక వుంటే భగవంతుడే ఆ పని చేసే శక్తి ప్రసాదిస్తాడు లభించినపని ఎలా పూర్తి చేయగలం అని ఆలోచించ కూడదు. శక్తిని బట్టి శిక్షణ పొందాలి సేవాకార్యానికి పూనుకున్న తరువాత మానావమానాల్ని గురించి మనం పట్టించుకోకూడదు అవమానించిన వారికి కూడా మనం సేవ చేయవలసిందేనని అంతా నిర్ణయానికి వచ్చాం

మా కోరికను అంగీకరింప చేయుటకు అపరిమితంగా కష్టాలు పడవలసి వచ్చింది. అది ఒకరసవత్తరమైన గాధ కాని యిక్కడ ఆ గాధ వివరాలు వ్రాయడం లేదు. మేము కొందరం యుద్ధంలో గాయపడిన వారికి సేవ చేయడాన్ని గురించిన శిక్షణ పొందాము మా శారీరిక శక్తికి సంబంధించిన సర్టిఫికెట్లు డాక్టర్ల దగ్గర తీసుకున్నాము ఆ తరువాత యుద్ధ రంగంలోకి వెళ్లడానికి అనుమతి యిమ్మని ప్రభుత్వానికి జాబు పంపాము మా జాబు యొక్క ప్రభావం మంచిగా పడింది. ప్రభుత్వం మాకు కృతజ్ఞత తెలుపుతూ, ప్రస్తుతం మీ కోరికను అంగీకరిరంచడం లేదని జాబు పంపింది యీ లోపున బోయర్ల శక్తి పెరిగిపోయింది. వాళ్ల దాడిభయంకరంగా సాగింది. వరదలా