పుట:తెలుగు వాక్యం.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

52

తెలుగు వాక్యం

బోధలోనూ, కాలార్థంలోనూ ఇట్లా రకరకాల అర్థాల్లో ఈ విభక్తి ప్రయుక్త మవుతుంది, అముఖ్యకర్మ, గమ్య, స్వామ్యార్థాల్లో నామ్నీకరణసాధ్యం. ఈ కింది: ఉదాహరణల్లో స్పష్టమవుతుంది.

(146)

a. సుజాత బ్రాహ్మడికి ఆవును దాన మిచ్చింది.
             → సుజాత ఆవును దానమిచ్చిన బ్రాహ్మడు.
b. సుజాత ఊరికి వెళ్ళింది.
             → సుజాత వెళ్లిన వూరు.
c. వాళ్ళకు రెండు ఇళ్ళున్నై .
             → వాళ్ల కున్న రెండు ఇళ్ళు.
d. నేను వాళ్లకు తెలుసు.
             → నేను తెలిసిన వాళ్ళు.

ఈ కిందివి వ్యాకరణ విరుద్ధాలు.

(147)

a. ఆతను చలికి వణుకుతున్నాడు .
              → ? ఆతను వణుకుతున్న చలి.
b. రూపాయికి నాలుగు పండ్లు ఇస్తారు.
              → * నాలుగు పండ్లిచ్చే రూపాయి.

కొన్ని నామ్నీ కరణాలు విశేషనామానికి బదులు సామాన్య నామాన్ని కోరతై -

(148)

a. అతను ఎల్లుండి వస్తాడు.
              → * a. అతను వచ్చే ఎల్లుండి.
                     b. అతను వచ్చే రోజు.
.
b. ఆమె పది గంటలకి వస్తుంది.
             → * a. ఆమె వచ్చే పది గంటలు.
                    b. ఆమె వచ్చే టైము.

c. పక్కింటామె పంచదారకు వచ్చింది.
             → * a. పక్కింటామె వచ్చిన పంచదార
                    b. పక్కింటామె వచ్చిన పని.