పుట:తెలుగు వాక్యం.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంశ్లిష్ట వాక్యాలు

51

తో వచ్యర్థధాతువుల అముఖ్య కర్మతోనూ, మూల పదార్థార్థంలోనూ, స్థితి హేతుకంగాను, ప్రతిక్రియాపేక్షక క్రియాప్రయోగంలో కర్మపదంతోనూ, నహార్థంలోను ప్రయుక్తమవుతుంది. వీటిల్లో కొన్నిటితో మాత్రమే నామ్నీకరణం సాధ్యమవుతుంది.

(145)

a. నేను ఆ అమ్మాయితో ఒక రహస్యం చెప్పాను.
       → నేను రహస్యం చెప్పిన అమ్మాయి.
            ( * నేను చెప్పిన అమ్మాయి)
b. ఈ బల్ల కట్టెతో చేశారు.
          → ఈ బల్ల చేసిన కట్టె.
C. సుజాత తలనొప్పితో బాధపడుతున్నది.
               → ? సుజాత బాధపడుతున్న తల నొప్పి.
d. సుజాత పనిమనిషితో పోట్లాడుతుంది.
               → సుజాత పోట్లాడే పనిమనిషి.
e. సుజాత స్నేహితులతో క్లబ్బుకి వెళ్లింది.
               → * సుజాత క్లబ్బుకి వెళ్లిన స్నేహితులు.

(145) (a) లో చెప్పు అనే క్రియతో అమ్మాయి అనే నామం ముఖ్య కర్మగానూ, అముఖ్యకర్మగాను రావచ్చు. (ముఖ్యకర్మ : ఆ అమ్మాయిని గురించి నీకు చెప్పాను.) నిష్పన్న నామబంధంలో ముఖ్యకర్మను బోధించే నామం లేకపోతే ఉన్ననామమే ముఖ్యకర్మస్థానాన్నీ ఆక్రమిస్తుంది. అందులో (145) (a) లో బ్రాకెట్లలో సూచించిన నామబంధం ఉద్దేశించిన ఆర్థాన్నీ బోధించదు. (c) లో తో అనుభోక్తృ దేహస్థితి హేతువును సూచిస్తుంది. తలనొప్పులలో రకరకాలను భావించి నప్పుడు (c) లో నిష్పన్న మైన నామం వ్యాకరణ సమ్మతమవుతుంది. (e) లో సహార్థంలో తో ప్రయుక్తమయింది. ఈ అర్థంలో నామ్నీకరణ సాధ్యంకాదు.

2.712 : కు విభక్తికూడా తెలుగులో బహుళార్థాల్లో ప్రయుక్తమవుతుంది. దానార్థక క్రియలతోను, వచ్యర్థక క్రియలతో అముఖ్యకర్మబోధకంగా, గమనార్థక క్రియలతో గమ్యసూచకంగానూ, అన్త్యర్థకక్రియతో స్వామ్యార్థంలోను, దేహమనస్థితి బోధకంగానూ, బాంధవ్యార్థంలోను, దేహమనఃస్థితులకు హేతు