పుట:తెలుగు వాక్యం.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంశ్లిష్ట వాక్యాలు

49

పై వాక్యాలలో a, c లలో లేని హేతుప్రాధాన్యం b, d లలో ఉన్నట్టు కనిపిస్తున్నది. ఇంకా ఇతర భేదాలుకూడా ఉండొచ్చు.

2.70 : నామ్నీకరణాలు : ఒక వాక్యాన్ని మరో వాక్యంలో నామపదం స్థానంలో ప్రయోగించినప్పుడు కొన్ని మార్పులు జరుగుతై. ఆ మార్పుల్ని నామ్నీకరణ విధానం అంటారు.

2.71 : విభక్త్యర్థనామ్నీకరణం : ఒక సామాన్య వాక్యంలో క్రియకు పూర్వం నామపదాలు భిన్నకారకార్థాలను సూచిస్తై. అవి విభక్తి ప్రత్యయాలద్వారా వ్యక్తమవుతై. ఆ నామాల్లో దేనినైనా ఉద్దేశ్యంచేసి మిగతా వాక్య భాగాన్ని విధేయం చేసేపద్ధతి విభక్త్యర్థ నామ్నీకరణం. ఈ ప్రక్రియలో ఉద్దేశ్యం చెయ్యబడిన పదబంధం క్రియకు పరస్థానానికి జరుగుతుంది. అప్పుడు క్రియ విశేషణంరూపంగా మారుతుంది. దాన్నే క్రియాజన్యవిశేషణమని ప్రాచీనులు వ్యవహరించారు. క్రియా నంతర స్థానానికి జరిగిన పదబంధంలో ఉన్న విభక్తి ప్రత్యయం ఈ ప్రక్రియలో లోపిస్తుంది. అయినా విభక్త్యర్థాన్ని గ్రహించగలుగుతాం. ఈ రకంగా నిష్పాదించిన నామబంధాన్ని ఇంకో వాక్యంలో నామంగా ప్రయోగించవచ్చు. ఈ కింది ఉదాహరణలు గమనిస్తే పై విషయాలు స్పష్టమవుతై.

(142)

సుజాత తెడ్డుతో భర్తను కొట్టింది →
? a. సుజాత తెడ్డుతో కొట్టిన భర్త.
  b. సుజాత భర్తను కొట్టిన తెడ్డు.
  c. భర్త ను తెడ్డుతో కొట్టిన సుజాత.

పైన నిష్పన్నం చేసిన నామబంధాల్లో క్రమంగా భర్త, తెడ్డు, సుజాత అనే నామాలు ఉద్దేశ్యాలు. వీటికి మూలవాక్యంలో ఉన్న విభక్తులు లోపించినా వాటి కారకార్థాలకు లోపం కలగలేదు. అదే ఈ ప్రక్రియలో ఉన్న విశేషం.

పై నామబంధాల్లో (a). ఆధునికసమాజంలో వ్యాకరణ సమ్మతంకాదు. అందుక్కారణం ఈనాటి సమాజంలో చట్టబద్ధమైన బహుభర్తృకాచారం లేక పోవటం. అట్లాంటి సమాజంలో ఇది వ్యాకరణ సమ్మతమే. వ్యాకరణ నమ్మతికి సామాజికమైన అలవాట్లకు, వ్యక్తిగతమైన నమ్మకాలకు ప్రమేయం ఉంటుందని కూడా ఈ ఉదాహరణ నిరూపిస్తుంది. బహుత్వబోధకవకాశంలేని నామం ఈ