పుట:తెలుగు వాక్యం.pdf/35

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

సామాన్య వాక్యాలు

21

1.27 : తెలుగు వాక్యాలలో కొన్ని రకాల అర్థ ప్రభేదాలను కలిగించగల శబ్దాలు కొన్ని ఉన్నై. ఇవి ప్రత్యేక వదాలు కావు. సాధారణంగా వాక్యంతంలో చేరతై. వీటిని వాక్యంలో దాదాపు ఏ పదానికైనా తగిలించవచ్చు. అట్లాంటి శబ్దాలు కొన్ని. 1. అంట > అట> ; 2. కదా, కదూ, కదే, గా; 3. , వే, రా, రోయ్, ఓయ్; 4. అండి; 5. లే; 6. ఏమో, ; 7. ; 8. .

పై వాటిల్లో అట తర్వాత మిగతా ఏ శబ్దాలయినా రావచ్చు. వీటిల్లో రెండో వాటికి కిలార్థకాలని, మూడోవాటికి సంబుద్ధ్యర్థకాలని, నాలుగో దానికి గౌరవార్థకమని, ఐదోదానికి నిరాదరణార్థకమని, ఆరో వాటికి సందేహార్థకాలని, ఏడో దానికి ప్రశ్నార్థకమని పేర్లు, ఎనిమిది సంఖ్యతో సూచించినది. క్రియ మీద వచ్చినపుడు ఆశ్చర్యార్థకం, మిగతా పదాలమీద వచ్చినపుడు అవధారణార్థకం, అవుతుంది.

వీటిలో అటకు అనుకృతిలో ప్రయోగించే అని కి సామ్యం ఉంది. అట ప్రయోగించిన వాక్యాలను అనుకరణ వాక్యాలుగానే నిరూపించవచ్చు. వక్త ప్రయోగించిన వాక్య విషయం తను స్వయంగా చెపుతున్న విషయం కాదని. ఇంకొకరు చెప్పిన విషయాన్ని తాను చెప్తున్నట్లుగా భావించవలసి ఉంటుందని వక్త ఉద్దేశించినపుడు అట ప్రయోగం జరుగుతుంది.

అట శబ్దప్రయోగంలో వ్యవహర్తల మధ్య కొన్ని భేదాలున్నట్లు కన్పిస్తున్నది. గ్రామీణ వ్యవహారంలో అంట అనే రూపం ఎక్కువగా కన్పిస్తున్నది. పట్టణాలలో కొందరి భాషలో అట, మరికొందరి భాషలో అనే రూపాలున్నై. ఈ రచయిత భాషలో సాధారణ వ్యవహారంలో అంట , బయటి వ్యవహారంలో అట ఉన్నై. ప్రయోగం మాత్రం లేదు.

అట ప్రయోగించిన ఈ కింది వాక్యాలను పరిశీలించండి.

(44)

a. శ్రీమతి సుజాతారావుగారు సిగరెట్లు కాలుస్తారట.
b. నేను నిద్దరలో కలవరించానట.
c. నువ్వు మీపై అధికారికి మస్కా కొడుతున్నావట.

మొదటి వాక్యంలో చెప్పిన విషయానికి తన బాధ్యత ఏమిలేదని తానె