పుట:తెలుగు వాక్యం.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

22

తెలుగు వాక్యం

క్కడో విన్న విషయాన్ని మాత్రమే చెప్పుతున్నానని వక్త ఉద్దేశం. రెండో వాక్యంలో చెప్పిన విషయాన్ని గురించి వక్తకు ప్రత్యక్ష జ్ఞానం లేనట్లు అట సూచిస్తున్నది. మూడో వాక్యంలో కూడా శ్రోతను గురించి వక్త పరోక్షంగా గ్రహించిన విషయాన్ని సూచిస్తున్నది. వాక్యంలో విషయానికి వక్షకు ప్రత్యక్ష జ్ఞాన రాహిత్యాన్ని సూచించటానికి అట ప్రయోగించబడుతుంది.

వాక్యాలలో -శబ్దంతో ఉన్న ప్రశ్నార్థక పదం ఉన్నప్పుడు - ప్రశ్నార్ధక పదం లేనప్పుడు ఏమో అనే రూపాలు సందేహార్థంలో చేరతై .

(45)

a. అతనెప్పుడు వస్తాడో?
b. అతను రేపు వస్తాడేమో.

అటాదులు ఒకే వాక్యంలో ఒకటికన్నా ఎక్కువ ఒకదానిపక్కన ఒకటి రావచ్చు. ఈ కింది వాక్యాలలో అట్లాంటి క్రమం కొంతవరకు తెలుస్తుంది.

(46)

a. ఆమె అందరితో పోట్లాడుతుందట గదరా?
b. అతడు మర్యాదగా మాట్లాడతారటనా?
c. అతను రేపు సాయంకాలం వస్తాడేమోగదూ?
d. నువ్వు చెప్పింది అతనేనా?
e. అతను రేపు వస్తాడేమోలే,

ఈ అటాదులు వాక్యంలో ఏ పదానికైనా తగిలించవచ్చునని ఇంతకు ముందు. చెప్పబడింది. ఇట్లా తగిలించబడిన పదాలు వాక్యంలో ప్రాధాన్యాన్ని వహిస్తై. అప్పుడు ప్రాధాన్యాన్ని పొందిన పదం ఆఖ్యాత స్థానానికి జరగకుండానే క్రియ నామ్నీకృత మవుతుంది.

(47)

a. అతను నిన్న వచ్చింది.
b. అతనా నిన్న వచ్చింది.

పై వాక్యాలలో మొదటిది వ్యాకరణ విరుద్ధం. ప్రాధాన్యాన్ని సూచించిన రెండవవాక్యం వ్యాకరణ సమ్మతం. అంటే ప్రాధాన్యబోధ లేకుండా క్రియ నామ్నికృతం కాదని అర్థం. పై వాక్యంలో ప్రశ్నార్థకమైన ఆ ఉపయోగించబడింది. అటాదుల్లో ఏవి ప్రయోగించినా ఫలితమిదేనని స్పష్టం. అంతేకాక ఈ అటాదులు. వాక్యంలో క్రియేతరమైన ఏ పదానికి తగిలించినా ఇదే ఫలితం వస్తుంది. ఈ శబ్దాలు