Jump to content

పుట:తెలుగు వాక్యం.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తెలుగు వాక్యం : కొన్ని ముఖ్య లక్షణాలు

109

కృతులు రెండింట్లోనూ ఆనుకరణసూచకం (అని శబ్దం) ఉంటుంది. (ఇది అనుధాతునిష్పన్న క్రియా అవ్యవహితయోగంలో. వికల్పంగా లోపిస్తుంది) పరోక్షానుకృతిలో ఉత్తమపురుష ప్రధానవాక్యంలోని కర్తను కాపీ (copy) చేసి. మారినప్పుడు క్రియానిభక్తి ఉత్తమపురుషనుంచి మారకుండా అట్లాగే ఉంటుంది. ఇది క్రియావిభక్తి విధానం విస్తృతంగా ఉన్న భాషలన్నిట్లోనూ ఇట్లాగే ఉండొచ్చు, తెలుక్కి ప్రత్యేకమైనాకావచ్చు. తెలుగులో కర్త్రుద్ధరణసూత్రం అనుకృతవాక్యం సమీకరణ వాక్యమైనప్పుడే ప్రవర్తిస్తునట్టు కనిపిస్తున్నది. హేత్వర్థంలో అని శబ్ద ప్రయోగంకూడా ద్రావిడభాషల ప్రత్యేకతగానే కనిపిస్తున్నది. ఆర్యభాషల్లో ఇట్లాంటి పద్ధతిలేదు. దక్కనీ ఉర్దూలోమాత్రం తెలుగుప్రభావంవల్ల కాబోలు కనిపిస్తున్నది.

5.36 : ఏకకర్తృక వ్యాపార సమసామయికానుపూర్విక సంబంధాలు తెలుగులోను, ఇతర ద్రావిడ భాషల్లోను అసమాపక క్రియల ద్వారా వ్యక్తమవుతై . క్త్వార్థక వాక్యాలు, హేత్వర్థక రీత్యర్థకాలు కూడా అవుతై వీటిలో కొన్ని ఆర్య భాషలకు కూడా పాకినై.

5.37 : తెలుగులో సంయుక్త వాక్యాలకూ, అసంయుక్త వాక్యాలకూ భేదం స్వల్పం. సంకలనార్థంలో క్త్వార్థక వాక్యాలే సంయుక్త వాక్యప్రయోజనంలో ప్రవర్తిస్తై. పదబంధ నంయోగంలో సంయోగ సూచకం సంయోజక పదబంధాలన్నిటికీ పరంలో ప్రత్యయంలాగా వస్తుంది. కొన్ని భాషల్లో పూర్వంలో వస్తుంది. ఇంగ్లీషులో and, or, but అనే పదాలను వాటికి పరంలో ఉన్న పదాలకు సన్నిహితమైనవిగా భావిస్తారు,

5.4: ఇవిగాక ఇంకా చాలా విశేషాలను ప్రస్తావించవచ్చుగాని, ఏది విశేషం అని నిర్ణయించుకోటం కష్టం. ఈ పైన పేర్కొన్నవి సర్వభాషా సామాన్యాలు కావు. ఇవి తెలుగులోనూ, ఇతర ద్రావిడ భాషల్లోనూ మాత్రమేకాక ఎక్కడో దూర తీరాల్లో ఉన్న భాషల్లో కూడా కనిపించవచ్చు. భాషలు భిన్నత్వాన్ని నిలుపుకుంటూనే ఏకత్వాన్ని సూచిస్తై. మానవత్వాన్ని పూర్తిగా ప్రతిబింబించేది భాష. మనుషుల్లోనూ, భాషల్లోనూ భేదాలున్నా మనుషులంతా ఒకటే, భాషలన్నీ ఒకటే.