పుట:తెలుగు వాక్యం.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

108

తెలుగు వాక్యం

ఈ వాక్యాలకు క్త్వాశత్రపిచేదాద్యర్థాల్లో అవు ధాతు నిష్పన క్రియారూపాలు అనుబద్ధమవుతై. క్రియావాక్యాలు ప్రాధాన్య వివక్షలో క్రియనామీకృతమై సమీకరణ వాక్యాలుగా మారటంకూడా తెలుగులో ఈ రకపు వాక్యాల ప్రాధాన్యాన్ని సూచిస్తున్నది.

5.341 : తెలుగు వాక్యాల్లో కర్త ఉద్దేశ్యం ఒకటి కానక్కర్లేదు. తెలుగు లో కర్త కన్ను ఉద్దేశ్యమే ప్రధానంగా కనిపిస్తున్నది. కొన్ని వాక్యాలకు వ్యక్త నిర్మాణంలో కర్తను గుర్తించటంకూడా కష్టమే. ఇంగ్లీషు వంటి వాక్యాల్లో వ్యక్త నిర్మాణంలో కర్తృపద ప్రాధాన్యం ఎక్కువ. ఏమీలేకపోతే it వంటి నిరర్థక శబ్దాన్నైనా కర్తగా ఉపయోగిస్తారు. కర్తృపదాన్ని లోపింప జెయ్యటానికి ఇంగ్లీషులో సాధారణంగా వీలుండదు. తెలుగులో సందర్భాన్నిబట్టి గ్రహించగలిగిన ఈ పదాన్నైనా లోపింపజెయ్యవచ్చు. తెలుగులో “ఎవరక్కడ ? "' "నేను" అనే సంభాషణ సాధ్యమయితే ఇంగ్లీషులో “Who is there : “ it is me' అనాలి తెలుగులో పదక్రమవ్యత్యయానికి ఉద్దేశ్య విధేయ వ్యత్యయంవల్లవచ్చే అర్థ ప్రాధాన్యముంది. కాని ఇంగ్లీషులోలాగా కర్తృకర్మ పదాల సంబంధ వ్యత్యయం జరగదు. ఇంగ్లీషుపదక్రమానికి ప్రత్యేక వ్యాకరణ ప్రయోజనంఉంది. తెలుగు పదక్రమానికి అట్లాంటి ప్రయోజనంలేదు. ఇంగ్లీషుభాష పదక్రమవ్యత్యయాన్ని అంతగా సహించదు. తెలుగుభాష ప్రాధానవివక్షకోసం పదక్రమ వృత్యయాన్ని ఉపయోగించుకుంటుంది.

5.342 : తెలుగుభాషలో స్వామ్య, అనుభోక్త్రాద్యర్థాల్లో నామానికి కు- విభక్తి చేరుతుంది. ఉదా:- ఆమెకు పదిచీరలున్నై, నాకుజలుబుచేసింది, నాకు సంతోషంగా ఉంది, అతనికి లాటరీలో లక్షరూపాయలువచ్చినై , వాడికి బజార్లో పార్కర్ కలం దొరికింది, నీకు తెలుసు – ఇట్లాంటి వాక్యాల్లో కు-బంధానికి బదులు ఇంగ్లీషులో కర్తృపదాన్ని వాడతారు. తెలుగులో ఉన్నటువంటి పద్ధతే తరతమ భేదాలతో ఇతర భారతీయ భాషల్లో కూడా కనిపిస్తుంది. స్లాలిక్ భాషల్లో కూడా కర్తృపద ప్రాధాన్యం తక్కువ.

5.35 : తెలుగులో అనుకరణ విధానం అతి విస్తృతమయింది. కేవలం భాషేకాక భాషేతరాంశాలుకూడా తెలుగులో అనుకృత మవుతున్నై. ఇంద్రియ గ్రహణ యోగ్యమైన ప్రతిదీ తెలుగులో అనుకరణయోగ్యమే. ప్రత్యక్ష పరోక్షాను