పుట:తెలుగు వాక్యం.pdf/110

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

96

తెలుగు వాక్యం


  • b. వాళ్ళన్నయ్య వచ్చాడు కాబట్టి మా ఆవిడ గారెలు వండింది. కాని నిజానికి రాలేదు.

(223) a లో అని కి పూర్వమున్న వాక్యభాగం విషయం యదార్థమవునా ? కాదా ? అనేదానితో ఆ వాక్య వ్యవహర్తకు సంబంధంలేదు. కాని 223 (b) ని ఉపయోగించిన వ్యవహర్త అందుకు బాధ్యత వహించాలి. అందువల్ల ఒకచోట వచ్చాడనిచెప్పి, అదే వాక్యాలలో మళ్ళీ రాలేదని చెపితే అది స్వయంవైరుధ్యం. (Self - contradiction) అవుతుంది.

3.91 : సంజ్ఞానామాల (Propernames) వర్గనిరూపణకోసంకూడా అని ప్రయోగం జరుగుతుంది.

(224)

a. ఆ వూళ్ళో వెంకయ్య అని ఒక రైతు ఉన్నాడు.
b. ఆదేశంలో మిసిసిపి అని ఒక నది ఉంది.

ఈ పై వాటినుంచి “వెంకయ్య అనే రైతు" “మిసిసిపి అనేనది " అనే నాము బంధాలను నిష్పన్నం చెయ్యవచ్చు.

3.92 : అర్థ వివరణలో అంటే శబ్దం ప్రయుక్తమవుతుంది. ఈ అర్థ వివరణ ఒక శబ్దానికిగాని, వాక్యానికిగాని, ఒక విషయానికిగాని, సంఘటనకుగాని జరగవచ్చు. శబ్దానుకృతి జరిగినప్పుడు అది ఏ భాషాశబ్దమైనాకావచ్చు.

(225)

a. ఏరాలు అంటే తోటికోడలు.
b. అంభన్ అంటే నీళ్ళు.
c. ఎన్నికలు వస్తున్నయ్యంటే నల్లధనానికి పని కలిగిందన్నమాట.

(224, 225 ) లో వాక్యాలూ, పదబంధాలు ప్రత్యేకంగా ఒకరులేక కొందరు వ్యవహర్తలు అనుకరించినవికావు. భాషలో పదాలనుగాని, జీవితంలో సంఘటనలనుగాని ఆనుకృతంచేసి వ్యాఖ్యానం చెయ్యటం ఇక్కడ కనిపిస్తున్నది. పై వాక్యాల్లో అనిఅర్థం అనిభావం అన్నమాట (215 c లో లాగా) వాడవచ్చు.

అన్నమాట అనేది తెలుగులో ఇతర నిశ్చయార్థక వాక్యాల తరవాత కూడా ప్రయుక్తమవుతుంది. ఒక వాక్యం వక్తచేస్తున్న వ్యాఖ్యానం అని సూచించటానికి వాడతారు. అట, కదా అనే - శబ్దాలుకూడా వ్యక్తమైన భాషాంశంమీద వక్త్రుద్దేశాన్ని సూచించేవే.