పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

82

తెలుగు భాషా చరిత్ర

( = ఇట్ల, (ఆ.ప. 1941-42.14-15.2, 600.25), ఏమి (తె. శా. 1.163-65.30, 892-922), అట్లు (శా. ప. మం. 1.2-3.41-42, 898-934), (3) అవ్యయ ప్రయోగంకల స్వతంత్ర శబ్దాలు ఉదా. మఱి (SII 6.585.1, 633-43), పిదప (పై. 4 922 2, 8), ఆర్థిన్‌ (శా. ప. మం. 1.2-3.7, 898-934), నెగి (పై. 10), మిణ్ణక (EI 30.280-84.14 972), పోలె (భారతి. 5.618.3, 850), తొల్లి (రా. ప. సం. 25-29.5,1065), పరువడి (పై.7). వీటిలో 'మిణ్ణిక' ఆనేది ఒకనాటి *మిణ్డు అనే క్రియకు వ్యతిరేకార్థక విశేషణరూపం.

    3.41. క్రియలు : క్రియలు మూడువిధాలు : సామాన్య, సంకీర్ణ, సమస్త క్రియలని. ఏకధాతుకమైన 'ఆగు' వంటివి సామాన్య క్రియలు. ఇవన్నీ దేశ్యాలే. నామప్రాతిపదికమీద క్రియాకారక ప్రత్యయంచేరి ఏర్పడ్డ క్రియలు సంకీర్ణక్రియలు.  ఇవి దేశ్యాల్లోనూ, ఎరువుమాటల్లోను ఉన్నాయి. ఉదా. (i) దేశ్యాల్లో : కట్ట్‌-ఇఞ్చ్-(భారతి 5.473-84.4, 848), ముఱ్చ్-ఇల్‌-(తె.శా. 1.163-65.59, 892-922); (ii) ఎరువుమాటల్లో : అనుభవ్‌-ఇంచు (పై. 22), ప్రవత్త్‌౯-ఇల్ల్- ( SII 10-23.2-3, 719-20). సమస్తక్రియలు. కేవలం దేశ్యాలే. ఇవి విరళంగా క్రీ. శ. ఎనిమిదో శతాబ్ధినుంచీ కనిపిస్తుండేవి. వీటిలో క్రియాప్రాతిపదిక మీద మరో క్రియాపదాంశంచేరి ప్రత్యేకార్థాలనిచ్చేవి, అస్వతంత్ర నామధాతువుమీద అనుబంధక్రియచేరి ఏర్పడ్డవి, అవి రెండురకాలున్నాయి. మొదటిరకం సమస్త క్రియలకు ఆయా అర్థాల్లో కొన్ని ఉదాహరణలివి : (1) వర్తమానార్థకం : ఏళుచ్‌-ఉన్ఱి  ( 11 337-479, 725); (ii) భవిష్యదర్థకం: నడపం-గల (027 4.101528, 1084): (iii) ఆత్మార్థకం : అఱిసి-కొన్న (తె. శా. 1.168-65,71-72, 892-922); (iv) అనుజ్ఞార్థకం: మణం-జనదు (పై- 70-71; (v) ఆధిక్యార్థకం: రా-దెంచు (SII 10-35.5,10); (vi) కర్మణ్యర్థకం: కట్ట-బడిన (పై. 629.5-6, 825), (vii) నిశ్చయార్థకం : రక్షిమ్పను- వలయున్‌ (తె.శా. 1.163-65.49, 892.922). ఇక రెండోరకం సమస్తక్రియలు చే-కొని (భారతి 5.618.8, 897) వంటివి.
      3.42. అకర్మక సకర్మకాలు : అకర్మక క్రియధాతువుమీద '-చు' ప్రత్యయంచేరిగాని, '-ఇంచు' ప్రత్యయంచేరిగాని సకర్మకక్రియలు ఏర్పడతాయి. అకర్మకధాత్వంతంలోని '-చు' 'వు'గా మారినప్పుడుకూడా సకర్మకక్రియ లేర్చడ