Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రాచీనాంధ్రం : శాసనభాషా పరిణామం.

81

మొదటిహల్లూ ద్విరుక్తం కావటం గమనించాలి. (2) విశేషణంగావాడే ద్వితీయాది విభక్త్యంగం రెండో రకం: (3) సంఖ్యావాచక విశేషణాలు మూడోరకం. (4) -ఎణ్డు/-ఎడు అనే మానార్థక ప్రత్యయాలు చేరిన విశేషణాలు నాలుగోరకం. ఉదా. మాన్‌-ఎణ్డు ( SII 10.29.9-10, 971), మాన్‌-ఎడు (పై. 5.12. 11, 1074). (5) విశేష్యంమీది ము ప్రత్యయ స్థానంలో వినిమాయక పదాంశమైన 'పు' వర్ణకం చేరిన విశేషణాలు అయిదోరకం. ఉదా. వేవ్‌-ఊర్‌ (EI 14.153-55.3, 145-46), వేం-బళ్ళి (పై. 30.280-84.6, 972). ఈ విశేషణాలు బహువిరళంగా ఉండేవి. (6) ఆజంత విశేష్యంమీద అజాది విశేష్యానికి ముందు టుగాగమం కాగా ఏర్పడ్డ విశేషణం ఆరోరకం. ఉదా. ఇరుకు-ట్‌-ఊరి (పై. 31.74-80.39-40;669). (7) విశేష్య విశేషణ లక్షణాలు రెండూ కలవి ఏడోరకం. ఉదా. ఉరుపు-పల్లి (పై. 3.277.17, 466). (8) కేవలం విశేషణంగా మాత్రమే ప్రయోగింపబడేవి ఎనిమిదోరకం. ఉదా. చెఞ్ + చెరుప్ (భారతి 1.110-22.13-14, 315-410), చిట్ట్‌-ఏరు. (JAHRS 5.51-56.19,763). (9) క్రియాపదాలుగా కూడా ఉండే ధాతుజ విశేషణాలు తొమ్మిదోరకం. ఉదా: (i) భూతకాలిక విశేషణాలు-ఇచ్చిన (EI 27.225-28.4, 575-600), ఉపేక్షించిన (శా. ప. మం. 1.2-3.20, 898-934), (ii) తద్ధర్మార్థకవిశేషణాలు : మను-వాణ్డు (SII 10.599.33,625-50 ). వక్రంబు రాదెంచు-వేర (పై. 35.5-6, 10). ఇక్కడి 'రాదెంచు' అనే రూపం గమనార్హం (iii) వ్యతిరేకార్థక విశేషణాలు : పెటని-వారు (పై. 633.2-3, 8), కొలది లేని-కొట్టంబుల్‌ (భారతి. 5.792.11,848-49).

     ఇవిగాక నామవాచకం మీద అగుధాతు భూతకాలిక విశేషణరూపం 'అయిన' చేర్చి నిర్మించిన విశేషణాత్మక పదబంధాలు చాలా విరళంగా కనిపిస్తాయి. ఉదా. ఉత్తమోత్తమున్ఱ్-అయిన (EI 27.231-34.4, 625-50). శాసనాస్థ నిదర్శనాలను బట్టి ఈ పదబంధనిర్మాణం క్రీ. శ. ఏడో శతాబ్దిలో కడప మండలంలో ఆరంభమై, 8-10 శతాబ్దుల మధ్యకాలంలో దక్షిణకోస్తాకు వ్యాపించి, పదకొండో శతాబ్దికి యావదాంధ్ర దేశంలో వాడుకలోకి వచ్చినట్టు తెలుస్తుంది.                                       
                                                                            3.40. అవ్యయాలు : మూడురకాల అవ్యయాలు శాసనభాషలో కనిపిస్తాయి. (1) విశేష్య ప్రాతిపదికకు 'కా' అనే అసంపూర్ణ క్రియారూపాలు చేరి ఏర్పడ్డవి. ఇవి అసంఖ్యాకం. (2) సర్వనామాలుగా భావించబడేవి. ఉదా. ఇఱ్ల
   (6)