Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రాచీనాంధ్రం : శాసనభాషా పరిణామం

83

తాయి. ఉదా. (i) అ.క్రి.ధా. + -చు: చెఱి-చిన (తె. శా. 1.163-65.75-58), 892-922), ఈ మార్పు జరిగేటప్పుడు ధాతుగత డకారం ఱకారంగా మారేది. ఇది క్రీ. శ. ఎనిమిదో శతాబ్దినుంచీ కనిపిస్తున్నది. (ii) అ. క్రి. ధా. -చు>-పుః చమ్‌-పిన (EI 27.234-36.20, 625-50), ఈ మార్పు జరిగేటప్పుడు ధాతుగతచకారానికి నకారం ఆదేశమవుతుంది. (iii) ఆ.క్రి.ధా. + ఇంచు: రా-వ్‌- ఇంచి (తె.శా. 1.163-65, 26 892-922).

    3.43. ప్రేరణార్థకాలు ; ప్రేరణార్థకక్రియలు రెండు విధాల ఏర్పడేవి : (i)  సకర్మకధాతువుకు -ఇంచు ప్రత్యయంచేరిగాని [ఉదా. కట్ట్‌-ఇఞ్చి (భారతి 5.473-84.4,848), కావ్‌ -ఇఞ్చి (EI 30.69-71.4, 699-700), సకర్మకధాతుగతమైన చకారానికి పకారాదేశంవచ్చిగాని (ఉదా. కుడి-పిన (పై. 27 280-31.6 625-50), పం-పు (పై. 211-25.7-8, 575-600)]. ఈమార్పులు జరిగేటప్పుడు పకారానికి ముందు నకారం అదేశం కావటమో (ఉదా. చొచ్‌-చు>చొన్‌-పు), ధాతుగతచకారానికి ముందున్న నకారం మకారంగా మారటమో (ఉదా. పన్‌-చు> పమ్‌-పు) జరిగేవి. 
    3.44. ప్రాతిపదికల పర్యాయరూపత : పదమధ్యసంధి : కాలార్థక ప్రత్యయాలు చేరేటప్పుడు క్రియాప్రాతిపదికల స్వరూపాల్లో కొన్ని రకాలమార్పులు వచ్చేవి.అవి పదమధ్యసంధులే అయినా ప్రాతిపదికల పర్యాయరూపత ఒకేచోట నిరూపించటంలో లాఘవ ముంది. కాబట్టి సంధి ప్రకరణంలోకాక వీటిని ఇక్కడే వివరిస్తున్నాం. ఈలాంటి మార్పులు ముఖ్యంగా ఎనిమిదిరకాలు. (1) భూతకాలిక ప్రత్యయాలైన ఇ, ఎలు గాని చేదర్ధక ప్రత్యయగతమైన ఇకారంగాని చేరినప్పుడు ధాతుగతయకారం సకారంగా మారేది. ఉదా. కేస్‌-ఇ. (పై. 30,69-71.5, 699-700), అఱిన్‌-ఇన (SII 10.599.25, 625-50), కేన్‌-ఇరి (పై. 47.2,7), వ్రాన్‌-ఎ (పై. 599.22, 625 -50), విడిస్‌-ఇన (శా. ప. మం. 1 2-3.15, 898-934). (2) ధాతుగతమైన ఉకారం ఇకారంగాను, ఇకారం అకారంగాను ప్రత్యయాదినున్న ఇ,ఎ,ల ముందు బహుళంగా మారేవి. ఉదా. (i) -ఉ>ఇ : కుడిప్-ఇన ( EI 27.230-31.6, 625-50), పొడిచ్‌>ఇ (SII 10.23.5, 719-20). ఉడిచ్‌-ఎ (భారతి 5.618, 897), చెఱిచ్‌ - ఇనను (తె. శా. 1.163.65.57-58, 892-922). ఈ మార్పుజరగని రూపాలు లేకపోలేదు. ఉదా. పొడుచ్‌-ఇ (SII 10.632.3, 725-75). (ii)