Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

78

తెలుగు భాషా చరిత్ర

కలిసి వర్ణసమీకరణం పొందినప్పుడు దీనికి 'ఇద్‌' అనే రూపాంతరం కలిగింది. 'ఇన్మడి' తరవాతి కాలంలో 'ఇమ్మడి' అయింది.

    3. మూన్ఱ్ (పై. 10. 217.4, 745-801), మూను (EI 203-206.10, 850), మూణ్డు (SII 10-6. 8-0, 1043 ), మూడ్‌ (పై. 5.12.3, 1074) 'మూటి- (పై. 6.584.6. 641, మూణ్టి-కి (పై. 10.6.6, 1043 ); ము-న్నూఱు ( EI 27.234-36.13, 625-50), మూ-నూర (SII 10.37.1, 8); ము-మ్మడి (పై. 6.9,1043); ము-వ్వుర (ఆం.ప. 1941-42. 14-15.2,700-25). విశేషణరూపాల్లో మీదిహల్లు ద్విరుక్తమైతే ధాతుగతదీర్థ౦ వ్రాస్వం కావటం, అద్విరుక్తమైతే మారకపోవటం గమనించాలి.
     4. నాల్కు (EI 27 225-28.13-14 575-600), నాలుగు (NI 3.1151 6-7, 650), నాల్‌-ఉను (AR 182/1933-34. 2.41. 2-3, 7); నల్‌-తుముడ్లు (AR 233/ 1949-50.9, 8); నల్‌-వురు (రా.ప.సం. 187-89.25, 1018).
    5. ఏను ( SII 6,585.10.633-63 ) అన్న రూపమొక్కటే దొరికింది.
    6. ఆఱు (భారతి 23.182-6.11, 641), ఆర-వాద్యది (తె. శా. 1.163-65.59-60. 892-922), ఆఱు-వది (రా.ప.సం. 187-89.92. 1018), ఆర్‌ -వ్వురు (SII 4-1014.2, 1038). 
    7. ఏఱు (EI 11,337-47.9, 725), ఏడు (SII 6.250 4, 742-98). విశేషణరూపాలు దొరకలేదు.   
    
     8. ఎణ్బొది (భారతి 23.182-86.5, 641), ఎణుంబొది (SII 6,534.3, 641), ఎనుబొది (భారతి 5.473-84,10, 848 ), ఎణ్మ (SII 10.29.26,971), ఎన్మిది (పై. 6.102.19,1006), ఎనమ్‌-అణ్డకును (పై. 10.29.8, 971). ఎనిమిది తొమ్మిది శబ్దాల వుతృత్తి స్పష్టంకాదు. ఎనిమిది పూర్వరూపాల్లో ణకారయుక్తమైనవి ప్రాచీనరూపాలు; నకారయుక్తాలు అర్వాచీనాలు. మూలదక్షిణ ద్రావిడంలో *ఎణ్/ఎట్ (=8) అనే రూపాలున్నాయని ఊహించవచ్చు. కాని '-మ, -మిది' వంటి ప్రత్యయాల పూర్వరూపాలను పునర్మించటం సాధ్యపడదు. 'మిది' ఉన్న రూపాను తెలుగు కొలామీ గోండీలలోను, -'మ, ఉన్న రూపాలు తుళు తెలుగులోనూ కనిపిస్తాయి (DED 670). 'ఎణ్-బొది,