పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రాచీనాంధ్రం : శాసనభాషా పరిణామం

77

    3.37. సార్వనామిక విశేష్యాలు : నామధాతువుకు పురుషబోధక ప్రత్యయాలు చేరి విశేష్యాలు ఏర్పడటం తెలుగువంటి ద్రవిడభాషల్లో ఒక విశిష్టత. ఈ శబ్దాలకు కొన్ని సమయాల్లో (నామ) విభక్తి ప్రత్యయాలు చేరుతాయి. పురుషబోధక ప్రత్యయాలు చేరిన క్రియలు కాలబోధకాలుగా ఉంటాయిగాని ఈ శబ్దాల్లో అలాంటి స్ఫురణలేదు. శాసనభాషలో రెండురకాల సార్వనామిక విశేష్యాలు లభించాయి. (i) నామవాచకం మీద మధ్యమ పురుషైకవచన ప్రత్యయం చేరినవి. ఉదా. ప్రాణసమానుణ్డ్-అవ్‌ - (తె. శా. 1.163-65. 26-27, 892-922). చెలి-వి (పై. 27) (ii) సర్వనామం మీద నిర్దేశ సర్వనామ ప్రత్యయం చేరినది. ఉదా. వాన్‌ -ఇద్‌-అ (JAHRS 1.31-85 7, 10).
    3.38. సంఖ్యావాచకాలు : నిర్మాణక్రమానిబట్టి సంఖ్యావాచకాలు విశేష్యాల వంటివే. ఇవి ప్రాథమిక సంఖ్యావాచకాలని, సార్వనామిక విశేషణాలని, రెండువిధాలు. ప్రాథమిక సంఖ్యావాచకాలకు 'అగు' ధాతురూపాలను చేర్చినప్పుడు ఏర్పడే సార్వనామిక విశేషణాలు ఒకరకం. అస్వతంత్రమైన సంఖ్యావాచక విశేషణ ప్రాతిపదిక లింగవచనబోధక ప్రత్యయాలను చేరిస్తే ఎర్పడేవి మరోరకం. విశేషణ రూపాలేర్పడేటప్పుడు కొన్ని సమయాల్లో సంఖ్యావాచక సర్వనామధాతువులోని దీర్ఘస్వరం హ్రస్వమవుతుంది. ప్రాథమిక సంఖ్యావాచకాలనూ, సార్వనామిక విశేషణాలనూ, పురుషబోధక సంఖ్యావాచకాలనూ క్రమంగా నిర్దేశిస్తాం.
   
    ఉదా. 1.ఒకొటి (త్రిలింగ రజతోత్సవ సంచిక 352-64.9-10, 991), పకొట్టి (SII 10.614.6,8 ); ఒక (తె.శా. 1.163-65.24, 892-922), ఒణ్ణు (శా.ప.మం. 1.2-3.24. 893-934); ఒరుల్‌ (పై. 10-11), వీటిలో మొదటిది *ఒకణ్డు అనే అర్ధంలో ప్రయుక్తమయింది. అంటే ఔపవిక్తికరూపం ప్రథమారూపంగా వాడుకలోనికి వచ్చిందని.
    2. రెణ్డు (EI 27.234-36.11, 625-50), రెంటి-కి (SII 5.23.8, 1094), ఇన్-మడి (రా.ప.సం. 187-89.6, 1018), ఇర-వది EI 27.225-23.13,575-600), ఇరు-పఱయది ఏను (AR 392/1904.11-13-575-600), ఇద్‌-దఱు (SII 5.1033. 7, 1098), ఇరు-వురు (పై. 6.593.3.4, 703.46) ఇరు-వణ్డ్రకు (పై. 4.1015.7, 1084). 'రెండు' కు విశేషణార్థంలో 'ఇను, ఇర, ఇరు' అనే రూపాంతరాలున్నాయి. మీది హల్లుతో