పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

76

తెలుగు భాషా చరిత్ర

కత్వాన్ని పరిహరించేటందుకు వాడుకనుంచి తొలగిపోయింది. వాడుకలో ఉన్నంత కాలం దక్షిణాంధ్రంలోనే మాండలికంగా ఉండేది. నేటి 'ఇందరు' శబ్దానికి పూర్వరూపమైన 'ఇన్దోఱు/ఇన్దూఱు'లోని - దోఱు, వ్యక్తులనే అర్ధంగల ప్రత్యేకశబ్దమేమోనని కొండభాషలోని డోఱు శబ్దాన్ని బట్టి ఊహించవచ్చు. 'వాణ్డు' కన్నా 'ఆతణ్డు' అనేది గౌరవాధిక్యసూచికంగా కనిపిస్తుంది. -న్ఱు> - ణ్డు అనే ధ్వని పరిణామంగల 'వాన్ఱు' ఏకవచన బోధకమేగాని వేరుకాదు. అందులోని శకటరేఫ బహువచన ప్రత్యయమన్న పూర్వాభిప్రాయం (సోమయాజి 1948) ప్రామాదికమే. క్రియాన్వయాన్ని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ఉదా. తేని 'ఱిచ్చినవాన్ఱు పఞ్చమహాపాతకు న్ఱకున్‌ (వ్యా. సం. 301-310.3-4, 600-25), వచ్చిననాన్ఱు ఞ్చమహాపాతకు అగు (EI 27.228-29.7-8, 600-25) మొదలైన వాక్యాల్లో వాన్ఱు బహువచనంలోనే ఉంటే క్రియాపదం 'అగుదురు' అని ఉండాలి. 'వారు' బహువచన రూపంగా అదేకాలంలో ఉండేదనడానికి ఱచువారు కళరేని (భారతి 5.935-48.12-13, 675) వాక్యాలు నిదర్శనాలు.

    ప్రశ్నవాచక సర్వనామాల్లో రెంటికి మాత్రమే ప్రయోగాలు దొరికేయి. ఉదా. (i) మహద్వాచకంలో-ఏక. ఎవ్వణ్డ్ ( JAHRS : 81-85.7 10 ); -ఎవ్వాండ్‌ (SII 10-4 12, 1008 ); ఎవ్వర్‌ (భారతి 23.182-86.14, 641) (ii) అమహద్భహువచనంలో - ఎవ్వి (తె. శా. 1.163-65 54-55, 892-922).
    పురషబోధక సర్వనామాల్లో ఉత్తమ, మధ్యమ, పురుషైక వచనాలకు మాత్రమే ప్రయోగాలు దొరుకుతున్నాయి. (i) ఉత్తమపురుష : ఏ (పై. 48); నా (పై. 26); నే (పై. 48); నాకు (SII 6.584 5, 641); (ii) మధ్యమపురుష : నీవు (తె. శా.  1.163-65. 26,892.922); నీ (పై 27).
    ఆత్మార్థకనామాలు దొరికినవి ఇవి : ఏక. తాన్‌. (శా.ప.మం. 1.2-3.40) 898-934); తన ( NII 287.2. 650 ); తనక (తె. శా. 1.163-65.44 ), 892-922), తన్ను ( NI 1 287.4, 650 ); బహు, తారు. (శా.ప.మం 1.2-3.40, 898.934); తమకు (పై. 21); తమ (తె.శా. 1.163-65 41, 892-922), తమ్ము ( EI 30.278-80.4. 825). ) *తమ-ను వర్ణసమీకరణం వల్ల 'తమ్ము'గా తొమ్మిదో శతాబ్దికే మారటం గమనార్ధం.