పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రాచీనాంధ్రం : శాసనభాషా పరిణామం

79

ఎణ్ -ఉం-బొది' వంటి ఏడో శతాబ్ది రూపాలనుచూసి 'ఎణ్' అనే ప్రాతిపదికనూ 'బొట' అనే ప్రత్యయాన్నీ సముచ్చయమైన 'ఉం' కలుపుతున్నదని భావించవచ్చు. 'మిది' కాలక్రమాన '-బొది'నుంచి ఏర్పడ్డదని కూడా ఊహించవచ్చు. 'తొమ్మిది' శబ్దంలోని -'మిది' తోటి సామ్యంవల్ల 'ఎనిమిది'లో 'మిది' చేరి ఉండవచ్చు. ఎనిమిది, తొమ్మిది శబ్దాలు రెండూ 'రెండు తక్కువపది, ఒకటి తక్కువపది' అనే పద్ధతిలో నిర్మితాలని, '-బొది, మిది' అనేవి 'పది' రూపాంతరాలని కొందరు భావించారు (సోమయాజి 1948,453-54). తొమ్మిది శబ్దం విషయంలో ఇటు వంటి నిర్మాణక్రమం కొన్ని ద్రవిడ భాషల్లో కనిపిస్తుంది. ఉదా. కన్న. ఒంభత్తు, ఒంబయ్‌; కొలామీ ఒంబయ్‌; తుళు ఒరుంబ; గోండీ ఉన్మా(క్‌), ఎడ్ము -( DEO 862, 2910) మొదలైనవి. అయితే ఎనిమిది విషయంలో ఈ విధమైన నిర్మాణక్రమం ఇతర భాషల్లో కనిపించటంలేదు.

   9. తొమ్భ (పై. 6.102.17. 1006). తోంభ (రా.ప.సం. 187-89.8, 1018) అనే రూపాలే దొరికాయి. నేటి వ్యవహారంలో 'తొంబ' అంటే 'చాలా (మంది)' అనే ఆర్థం.
   10. పది (CIT 2.6.11, 1079 ); పదు-నుఱ్ఱ (SII 10.627.12, 9/10). సమస్త శబ్దాల్లో దీనికి అనేక రూపాంతరాలుండేవి. ఉదా. ఇరవది ( EI 27.225-28.  13, 575-600 ), ఏ-బది ( పై. 228-29.4, 600-25), పణ్డ్-ఱెణ్డు ( SII 10 599.21, 625-50) ఎణ్-బొది (భారతి 23.182-86,5,641 ), పద్‌-ఏన్‌ ( పై. 5.735-48.8,675 ), ఇరు-భది (SII 10.245, 682); పన్‌-దుంబు (AR 182/1933-34. Pt II 41.3-4,7), ము-ప్పది. ( SII 10.217.4, 745-801 ), ఎణ్-మ ( పై. 29.26, 971), నళ్‌-పాద్‌-యది (త్రిలింగ రజతోత్సవ సంచిక 352-64.9.991), ఎన్‌-మిది (SII 6.102.19, 1006 ), నల్‌-వొది ( రా.ప. సం. 187-89.4, 1018 ), ఏం-భయ్‌ (SII 5.79-7, 1094). ఆయా రూపాంతరాలకు కారణమైన పరిసర లక్షణాలు స్పష్టంగా తెలియటంలేదు. పై ప్రయోగాల్లోని 'పదున్ఱు' అనేది *పదుణ్డ్రు అనే రూపానికి తప్పుగా రాసిన లేఖనప్రమాదం. చివరి రూపం నేటి 'యాభై' అనే వ్యావహారిక రూపానికి పూర్వరూపం. 
    100. నూర (పై. 10.37.2,8), నూఱు (EI 27.234-36.13, 625-50), నూట (SII  10.6.7, 1043), నూఱింటికి (పై. 5.23.10,