పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3.34. ద్వితీయా విభక్త్యంగనిర్మాణం: మహద్వాచక శబ్దాల ద్వితీయాది విభక్త్యంగం మూడువిధాలుగా ఉండేది. (1) ధాతువు, (బంధుత్వబోధకాలైన-అయ్యవంటి పదాంశాలు), బహువచన లకారం, విభక్తి ప్రత్యయం క్రమంగా చేరి ఏర్పడ్డవి, ఉదా. పాఱ-కు (EI 27.225-28. 10-11, 575-600), కత్తి-శమ్మన్-కు (పై, 231-234.7, 625-50), సోము-ɸ-కు (NI 3.1151.7-8,650). (2) ధాతువు, ఏకవచన సూచకమైన -(న్) ఇ/-న/ɸ, బహువచన లకారం, విభక్తి ప్రత్యయం క్రమంగా చేరి ఏర్పడ్డవి, ఉదా. భీము-న-కు (తె.శా. 1.163-65.3,892-922). (3) పైవిధంగానే ఉండి బహువచనంలో రేఫకలవి, ఉదా. వా-ని-కి (EI 11.337-47.20,725), ఇరువణ్డ్-ర-కు (SII 4.1015.7, 1084). అమహత్తుల ద్వితీయాది విభక్త్యంగం మూడు విధాలు. (1) ధాతువు, (మీద -పఱువంటి స్థలవాచకపదాంశమూ), దానిమీద ఏకత్వ సూచక '-న/ɸ, ఆ మీద బహువచన లకారం, ఆ తర్వాత విభక్తి ప్రత్యయం కలవి, ఉదా. చిఱుంబూర్-ఇ (EI 27.221-25.6, 575-600), చెఱువు-ɸ-కు (SII 10.37.3,8), లింగా-న-కుం (NI 3. 1072.16,1088), (2) ధాతువు, 'ము/-వు', 'న/ɸ-ను', బహువచన లకారం, విభక్తి ప్రత్యయం వరసలో ఉండేవి, ఉదా. కొట్ట-ంబు-న (EI 27.225-28. 10,575-600), ధమమ్మున్-వు-ల (తె.శా. 1163-65.56, 892-922). (3) ధాతువు, ఆదేశాగమాత్మకాలైన 'త,ట,ణ్డ/ఇɸ, బహువచన లకారం, విభక్తి ప్రత్యయం వరుసగా ఉండేవి, ఉదా. ఏణ్-టన్ (భారతి 23. 182-86.5,641), నూ-ట-ɸ (SII 10. 6-7, 1043), నూఱింటి -కి (పై. 5. 23. 10, 1094), విత్వఱ్ -తి (పై. 6.585.10, 633-63). ఈ ఔపవిభక్తికాలు చేరని నూయి-ని (పై. 10.595.14, 925-50) వంటి రూపాలు కూడా విరళంగా కనిపిస్తాయి. ఈ ఆరు విధాలయిన నిర్మాణక్రమం గల ప్రాతిపదికలే షష్ఠీవిభక్తి సూచకాలుగా, విశేషణాలుగా, ఉపయోగ పడతాయి. పైవాటిలో నప్రత్యయరహితమైన సోముకు, చెఱువుకు గమనార్దాలు.

3.35. ప్రథమేతరవిభక్తులు: ద్వితీయావిభక్తికి 'ɸ, న్,ని,ను,మ్,నిం,ము' అనే సపదాంశాలు ప్రత్యయాలు. ఉదా. దేవి-ɸ (భారతి 23. 182-86.13, 641), దీని-న్ (శా.ప.మం. 1.2-3.34,898-934), కన్న్యళ-ను (NI 3.1152-55.49,7), రడ్డి-ని (SII 6.250.5,742-98), నాణ్డి-ని