ణ,ఱ, య,వ లు కూడా లోపించటం, ఉదా. (i)-ణ లోపానికి బ్రాహ్మ-ల (పై 2. 10.645.59, 1060); (ii) -ఱ లోపానికి: కూన్తు-లున్ (పై. 647.41,1097); (iii) -య లోపానికి: బో-ళ్ (EI 18.1-4.29, 663), వ్రా-లు (SII 6.250.7, 742-98); (iv) -వ లోపానికి: మోదొ-లు (పై. 593.6,709-46), గురు-లు (పై. 10.645.52, 1060); (3) ప్రాతిపదిక చివరి అ,ఇ కారాలు ఉకారంగా మారటం: ఉదా (i) -అ>-ఉ: సోము -ళ (NI 3.1152-55.23,7): (ii) -ఇ>-ఉ: దేవు-లు (SII 10.596.5, 929-50). ఈమార్పు కేవలం ఎరువుమాటల్లోనే నిత్యంగా జరగటం గమనించ దగ్గది. (4) ప్రాతిపదిక చివరి ము ప్రత్యయలోపంతో బాటు తత్పూర్వ స్వరానికి దీర్ఘత రావటం : ఉదా. (i) ఏకవచనంలో: నరకా-నం (పై. 4. 14, 1008), రాజ్యా-నయు (భారతి 5. 796. 17,1023), భోగా-నకు (SII 10.644.78-79, 1060), లింగా- నకుం (NI 3.1072.16,1088), నిమిత్యా-న (SII 4.1300. 5,1095); (ii) బహువచనంలో: కుంచా-లు (పై. 1014.5, 1038), వర్షా-లు (పై. 10.60. 1, 1091). (5) ప్రాతిపదిక చివరి అచ్చు లోపించి తత్పూర్వ హల్లులు బహువచన ప్రత్యయంతో కలిసినప్పుడు వాటి గుణంలో (quality) కొన్ని మార్పులు వచ్చాయి. అందులో నాలుగురకాలు మార్పులు ఏడో శతాబ్దికి, మరో రెండు ఎనిమిది, పదకొండు శతాబ్దులకు చెందినవని గ్రహించవచ్చు. (i) రేఫ డకారంగానో శకటరేఫగానో మారటం, ఉదా. (అ) ఊడ్లందు (పై. 6. 585.10, 633-63), వడ్లు (AR 233/1949-504,8); (ఆ) ఆచాట్లు (SII 10 47.2,7), పుఱ్ఱనూఱ్ల (పై. 600.6-8,8); (ii) శకటరేఫ డకారంగా మారటం, ఉదా. ఆడ్లు (భారతి 5.935-48.8,675), మఱుతుడ్లు (SII 10.594.9-10, 925-50); (iii) డకారం 'ల/ళ' గా మారటం, ఉదా. గుళ్ళువు (NI 3.1152-55.44,7), రట్టగుళ్ళు (LI 27.234-36.14, 625-56); (iv) ద్విరుక్త టకారం అద్విరుక్తం కావటం, ఉదా. పుట్లు (SII 6.585.10,633-63), భట్లు (పై 10.6.12, 1043); ఇది సార్వత్రికమైన సంప్రదాయ వ్యాకరాణాలు ఈలోపాన్ని గమనించకపోవటం ఆశ్చర్యకరం. (v) లకారం డకారంగా మారటం, ఉదా. మంగడ్ల (పై. 6.250.7,742-98); (vi) నకారం జకారంగా మారటం, ఉదా. మ్రాంకుల (పె.4.1016.3, 1087), రేంగుల ర.ప.సం. 187-89.16,1018). ( vi) లేఖన సంప్రదాయానికి సంబంధించినవి కావచ్చు.
పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/86
Appearance