Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

70. తెలుగు భాషా చరిత్ర

62.4, 10). పై వాటిలోని చివరి మూడు మాటలూ గమనార్హాలు. కొన్ని సందర్భాల్లో మహదేకవచనంమీద -రు ప్రత్యయం చేరి (అమహత్తుల్లోలాగా) బహువచన రూపం ఏర్పడటం కద్దు. ఉదా. వాణ్-ర్ (SII 4,1015.12,1084), ఇరువణ్డ్‌-రకు (పై. 7). వీటిని కన్నడంలోని, 'అవ-న్‌' అవ-న్డ్-ఇర్‌, మగ-న్డ్-ఇర్, ఆళియ-న్డ్ -ఇర్‌, తాయ్వ్‌-ఇర్‌' వంటి మాటల్తో పోల్చినప్పుడు, ఈ విధానం విరళంగా నయినా ఇతర ద్రావిడ భాషల్లో ఉందని గమనించగలం. ఇదే లక్షణం 'చేనులు/చేలు' వంటి చోట్ల కూడా కనిపిస్తుంది.

3.32. మహదమహద్బహువచనం : మహదమహత్తులకు సాధారణమైన బహువచన ప్రత్యయం -లు. (ఇదిగాక అప్రాణివాచకాల్లో మాత్రమే కనిపించేది. -కు/-గు. ఇది-లు ప్రత్యయానికీ ప్రాతిపదికకూ మధ్యలో వస్తుంది). ఇందుకు కొన్ని నిదర్శనాలు: ఉదా. (i) ప్రాణివాచకాల్లో : ఆణపోతు-లు (వ్యా. నం. 301.10.2, 600-25), కన్న్య-ళ్-అను (NI 3.1152-55.49, 7) బో-ళు (SII 10.23 9,719-20 ), రాజు-ల్ల్-అ (EI 27.225-28.2, 575-600); (ii) అప్రాణివాచకాల్లో : ఆడ్-లు (5.935-48.8, 675), గుళ్-ళు-వు (NI 3-1152-55.44, 7), మ్రాం-కు-ల్‌-అ. (SII 4.1016, 1087), రేం-గు-ల్‌-అ. (రా. వ. నం. 187-89.16, 1018). చివరి రెండు మాటల్లోని-కు, -గు.లు పునరుక్తంగా వాడినవే. ళు పూర్వరూపం -లు తరవాతి రూపం. ఏడో శతాబ్దికే ళకారం లకారంగా మారిందని ఇంతకు ముందే (2.11) గ్రహించాం.

3.33. బహువచనంలో పదమధ్య సంధి : బహువచన ప్రత్యయం చేరినప్పుడు ప్రాతిపదికాంతంలో కొన్ని ముఖ్యమైన మార్పులు జరిగాయి. అవి అయిదు. విధాలు? (i) ప్రాతిపదిక చివరి-అ-ఇ-ఉ, లు లోపించగా సంయుక్తాక్షరాలేర్పటం : ఉదా. (i) అ లోపించినవి : మణునుఱ్ఱు (EI 27,225_26,14. 575-600), కఞ్చగార్లు (వై .30.69-71.8, 699-700), పెగ్గడ్లు (AR. 1933, II AP.B, 56.7.1072); (ii) - ఇ లోపించినవి: గుడ్లు (SII 6.585.2, 633-63), కోమట్లు (పై. 4.1014,7,1038); (iii) ఉ లోపించినవి  : ఏణ్డ్లు (EI 4.314-18 17, 1075-76). నంజుండ్లు (SII 4.1015.9.1084). (2) ప్రాతిపాదిక చివరి అచ్చుతోబాటు దానికి ముందున్న