(భారతి 5.473-84.6,848), చోఱ-నిం (పై. 8188,893), తమ్-ము (El 30.278-80.4,825). చివరి వర్ణసమీకరణంవల్ల నకారం మకారంమైన రూపం.
'-న,-ం' లు తృతీయా విభక్తిని సూచించే సపదాంశాలు. సప్తమీ ప్రత్యయంతో వీటికి ధ్వనిసంబంధంగా, అర్థసంబంధంగా పోలిక ఉంది. నకారం తృతీయా ప్రత్యయంగా క్రీ.శ. 9/10 శతాబ్దినుంచి మాత్రమే వాడుకలోకి వచ్చింది. కాని పదకొండో శతాబ్దివరకు దీనికి అంత ప్రాచుర్యం కాని, నియతో వయోగంకాని కనిపించదు, ఉదా. పరాక్రమంబు-నన్ (తె.శ. 1.163-65.9-10,892-922), అంగంబున-ం (EI 30.280-84. 13, 972). 'చేత, చేతం, తో, తోన్, తోడ, తోడం, తోఱన్' అనే అనుబంధాల నుపయోగించి తృతీయావిభక్త్యర్ధాన్ని బోధించేవారు, ఉదా. బోళ-చేత (ఆం.ప. 1941-42.14-15.2,600-25), చోడుళ-తోడ (SII 10. 626. 4, 848-92), నలరామనిభు-తోఱన్ (భారతి 5.618. 5,897), పదువ-తో (పై. 473 84. 5,848), వైదుంబుళ-చేతం (SII 10.640. 4,9/10), మణ్డ-తోన్ (రా.ప.సం 25-29,8-9, 1065), మెచ్చు-తోడం (EI 4.314-18.28,1075-76). పర్యాయరూపాలైన 'తో' తోడ' మొ. సహార్థ బోధకాలు; చే(త) మొ. కర్తృబోధకాలు.
చతుర్థి విభక్తిని 'కి(న్), కు(న్), కూ, క్' అనే పదాంశంతోను, 'పొణ్ణె' అనే అనుబంధంతోను సూచించేవారు. సంప్రదాయ వ్యాకరణాలు దీన్ని షష్టీ ప్రత్యయంగా గణించినా ఆ అర్థంలో దీనికి ప్రయోగమే లేదు, ఉదా. చేనుకు (NI 3.1151.9 650), సోము -కు (పై. 7-8), దీనికి (SII 6. 585. 12,633-63), ఱేని-కిన్ (VS 301-310.3,600-25), రాజులా కున్ (SII 6. 584.2, 641), వసన్తీ స్వరంబు-న-న్ (EI 27.234-36.15-16, 625-50), పరోపకారంబు-పొణ్ణె (తె.శా. 1-163-65.35, 892-922). ఉదంత ప్రాతిపదికమీద-కున్, ఇదంత ప్రాతిపదికమీద పరిపూరక ప్రవృత్తిలో వచ్చేవి. కావ్యభాషలోలాగా 'చేనికి' అనే రూపం లేకపోవడం ఉదంత మహత్తుమీద ప్రత్యయానికి ముందు నగాగమం రాకపోవటం గమనించదగనివి. మూలద్రావిడంలో ద్వితీయా-చతుర్థీవిభక్తులు ఒక్కటిగానే ఉండేవని, 'కిస్/కున్' లోని, నకారం ద్వితీయా ప్రత్యయానికి ప్రతిరూపమని ఴూల్ బ్లాక్ (1954, 20-21)