Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్రమ్మ (తె.శ. 1.163-65.67,892-922): ద్రమ్మ-ము (JAHRS 1.81-85.3,10), (iii) ప్రత్యయాలతో కనిపించేమాటలివి కొన్ని : ఉదా. నాగ-బు(భారతి 5. 934.1,200), కొట్ట -ంబు-న (EI 27.225-28. 10,575-600), చే-ను (SII 6.585.10, 633-36), దేశ-ము (NI 3.1151.6,650), పురస్సరం. (EI 29.160-64. 4, 680), ప్రసాద - ф-చేసిరి(SII 10.609. 14,675-99), సాసన-వు (CP 10/ 1908-9.1,709), కిరన-మ్ము-న (భారతి 5.618. 5,850). పై నిదర్శనలను బట్టి-వు ప్రత్యయం ఎరువు మాటలమీదనే వచ్చేదని, అది క్రీ.శ. ఎనిమిదో శతాబ్దం నుంచి మాత్రమే కనిపిస్తుందని చెప్పవచ్చు. కొన్ని మాటలు -ము, -వు లు రెంటితోనూ దొరుకుతున్నాయి, ఉదా. పరిహార-ము (పై. 236-38.10-11,700-25): పరియారు-వు (రా.ప.సం. 71-72.19-20,847), ప్రాకార-ంబు(భారతి 5.618.11, 850): ప్రాకారు-వు (SII 10. 651.11, 1090-91). వీటినిబట్టి -వు చేరినప్పుడు ప్రాతిపదిక చివరి అత్తు ఉత్తుగా మారేదని చెప్పవచ్చు. -బు ప్రత్యయం లేఖకదోషమో పాఠక దోషమో కావచ్చు -ంబు ప్రత్యయమే అమహదేకవచనంగా ఉండి ఏడో శతాబ్దికి ఎరువు మాటల్లోను, ఎనిమిదో శతాబ్దికి దేశ్యపదాల్లోను -మ్/-ముగా మారింది. అజ్రహితంగా -ము ప్రత్యయాన్ని వాడటం ఏడో శతాబ్దికే స్థిరపడిపోయినా, పండితు లీనాటికీ దాన్ని దోషంగా పరిగణిస్తున్నారు. -ంబు వర్ణసమీకరణం వల్ల తొమ్మిదో శతాబ్దికే -మ్ముగా పరిణమించింది. చేను, కొలను వంటి శబ్దాల్లోని-ను ప్రాతిపదికలో భాగం కాదు. అది-ము ప్రత్యయానికి రూపాంతరమనవచ్చు. ము ప్రత్యయాంతాలకు లాగానే వీటికి 'ను' తో కలిసీ, కలియకా, బహువచనరూపాలుండటం ఒక కారణం. కెయమ్/కెయన్, కుళమ్/కుళన్ వంటి పర్యాయరూపాలు తమిళంలో కూడా ఉండటం రెండో కారణం.

3.31. మహన్మహతీ బహువచనం: ప్రాతిపదికమీద -రు ప్రత్యయంచేరి మహన్మహతీ బహువచనరూపం ఏర్పడుతుంది. అప్పుడు తత్సమ ప్రాతిపదికల చివరి అత్తు సాధారణంగా ఉత్తుగా మారుతుంది, ఉదా. ఎవ్వ-ర్ (భారతి 23, 182-86.14, 641), వేవు-రు (EI 27.234-36.19, 625-50), దేవర (భారతి 9.461-67.1,8), మల్లు-ర (SII 10.614. 6, 8), మలిను-ర్ (శా.ప.మం. 1.2-3. 15,898-934), సంయుక్తు-ర్ (ఆం.సా.ప.ప. 24. 158-