అత్యంత ప్రాచీనమూ, బహుశా తమిళంనుంచి సంక్రమించింది కావచ్చు. -న్ఱు ప్రత్యయం క్రీ.శ. ఏడో శతాబ్దికి -ణ్డుగా మారింది. కాని లేఖన సంప్రదాయలలో పదో శతాబ్దిదాకా నిలిచింది. ధ్వనిపరిణామం తొమ్మిదో శతాబ్దికే పూర్తయింది. ఇది పద్యశాసనాల్లో వైకల్పికంగా -ఁడుగా మారింది. '~' కు పూర్వాచ్చుకు వచ్చిన ఆనునాసిక్యమని అర్థం. -ను చేరిన దేశ్య పదాలసంఖ్య అత్యల్పం. తత్సమాదుల్లో ఇది చేరినప్పుడు పదాంతంలోని అత్తు వైకల్పికంగా ఉత్తుగా మారేది, ఉదా.ఓజ-న్ఱు (EI 27.240-42.20,725), ఉత్తమోత్తము-న్ఱు (పై. 231-34. 4, 625-50), సోమనాథ-ఁడు(SII 10.4.7,1008). హల్పూర్వానునాసిక లోపం సంప్రదాయంగా ఉన్న కన్నడ ప్రభావంవల్ల ధనంజయు-ఱు ఏర్పడి ఉండవచ్చు. మూలద్రావిడంలో మహదేకవచన ప్రత్యయం *-న్ఱ్ గా ఉండి, దక్షిణ ద్రావిడంలో *ఱకారలోపం పొందిందని బరోగారి అభిప్రాయం (కృష్ణమూర్తి గారికి రాసిన లేఖద్వారా తెలిసింది). ప్రాచీన ద్రావిడంలోని *-న్ ఱ్ /*-న్ ట్ అనే ఈ ప్రత్యయం దంతమూలీయోచ్చారణలో *న్-ట్ గా ఉండేదని, దీంట్లోని ట్-వర్ణం అమహదేకవచన శబ్దమైన *అతు-కు సంబంధించిందని ఎమెనోగారి ఆశయం (1955, 10.5). బహువచన ప్రత్యయం చేరినప్పుడు ఏకవచన ప్రత్యయం సాధారణంగా లోపిస్తుంది. ఈ లక్షణం ప్రకారం 'కున్తుఱ్, కున్తుల్' శబ్దాలను పోల్చి చూసినప్పుడు -ఱు ప్రత్యయం ఏకవచన బోధకమని భావించవచ్చు. ద్రావిడభాషల లింగబోధక ప్రణాళిక నిర్దుష్టం కానందువల్ల ఈ విధంగా వ్యాకరించటం సమర్థనీయమే.
3.30. అమహదేకవచనం : అమహత్తుల్లో కూడా ప్రథమైకవచన ప్రత్యయం చేరనివి, చేరినరూపాలూ చేరనిరూపాలూ రెండూ ఉన్నవి కనిపిస్తాయి, ఉదా. (i) ప్రత్యయాలు చేరనివి: వేపుర (EI 14. 153-55.3, 145-46), పణ్టూర (పై. 6.315 19.24,244), కొట్టూరు (సర్కార్ 1942,1.256-57.19, 330-75), .
తాన్ఱికొన్ఱ (IA 9. 102-3.7,5), ఆణతి (EI 27.234-36. 15, 625-50), మొ. అనేకం. (ii) ప్రత్యయరహితంగా, సహితంగా కనిపించేవి: (అ) దేశ్యాల్లో: ఇల్లు (SII 10.645,48 1060),
కోయిల-ము : (IA 13.50.57, 918-25),
రామడు (భారతి 7.297-318.44, 715-20), మడు-వు (CP 13/1908-9. 19,709); (ఆ) తద్భవాల్లో : దణ్డు (రా.ప.సం. 71- 72. 19,847), దణ్డు-వ్ (భారతి 5.618.7,897); (ఇ) తత్సమాల్లో