Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తత్సమాల్లో, ద్రుతాంతాలమీద, విశేషణాలమీద, క్త్వార్ధకాలమీద, సమాసగత సంవృతాక్షరాల్లో గసడదవాదేశం జరిగేది. ఉదా. తత్సమాల్లో : కలయంత- గాలంబు. (SII 6.585.21, 633-63), విత్తుపట్టు- వసాదణ్చేసిరి (EI 7.177-192.74, 945-70); ద్రుతాంతాలమీద: నాలును వుట్టు ( 1201-9228, 70) కళ్టెంసూరె (2 8.250,7, 742-908), ఇన్దు వ్రత్యక్షబ యన్నన్‌ (శా. వ. ముం, 1,,2‌3. 26-27, 898-934.) విశేషణాలమీద : ఇరు-వుట్టి (SII 6.585.9, 633-63); స్థితి-నెఱ్పి (SII 10. 645.57.1060). , పొంది-గాని (తె. శ. 1.163-65.6, 892-922); సంవృతాక్షరాలో: . నిడు-గట్ట (EI 18.313-16. 15, 696-709), దమ్మ-వురంబున (భారతి 5.473-84. 10-11 848). అయితే మొత్తంమీద శాసనభాషలో ఈ ఆదేశం చాలా విరళంగా


3.26. ద్రుతం, ద్రుతసంధి: ద్రుతమన్నది పదాంతంలోని అనునాసికవర్ణమేగాని మరొకటి కాదు. క్రీ.శ. 6-9 శతాబ్దుల మధ్యకాలంలో ద్రుతసంధి వైకల్పికంగానే ఉండేది. కాలక్రమాన అది బహుళంగా పర్యవసించినా, క్రీ.శ. పదకొండో శతాబ్దిలో కూడా ఇది నిత్యసంధి కాలేదు. అయితే క్రీ.శ. తొమ్మిది పది శతాబ్దుల్లోని పద్యశాసనాల్లో మాత్రం. ద్రుతసంధి నిత్యంగా ఉండేది, ద్రుతాంతాలమీది పరుషాలు సరళాలు కావడం పదిరకాలుగా ఉండేది, ఉదా. ద్వితీయాంతాలమీద: దీని-గాచినవారు (NI-3-1151, 10, 650); తృతీయాంతాలమీద: వైదుంబుళచేతం-బట్టంకట్టబడి - (SIi 10.640.4,9/10); . చతుర్యంతాలమీద: నాకు-బణి సేసిన (పై. 6.584. 5, 641); సప్తమ్యంతాలమీద: సుద్దపక్షబున-బఇ్చమియు (JAHC 3.46-21.9-10, 678); సముచ్చయంమీద: " పణ్ఱెంణ్డుం గొణి (భారతి 5.473-84,40-41,848); అన్నంత క్రియలమీద.. కట్ట బడిన (SII 10. 629.5,825); భూతకాలికసమాపక క్రియలమీద: కట్టించెం-గ్రమబున (శా.ప.మం. 1.2-3,40-41, 898-934); విధ్యర్ధకక్రియలమీద చేయవలయుం - గాన (తె.శా. 1.163-65,29-30, 892-922); అవ్యయాలమీద: నేల యెల్లం-గావంబూని (పై. 12); విశేషణాలమీద: నిఱ్ఱు-జెఱువున (SII 10.652.6,1095). ద్రుతసంధి జరిగిన సందర్భాలు లేకపోలేదు, ఉదా. పాఱకు కుణ్డికాళ్ళుళ (EI 27.225-28. 11-12, 575-600), పులొంబున-చెఱువు