పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(SII 6.584.6-7, 641), చేరమజ్గలమ్బున-తొఱ్రుకొణ్ణన్ (పై. 10. 631.6-8,9/10), ఏణ్టన్-పళ్లినాట్టి (భారతి 23. 182-86 5,641).


3.27. ద్రుతంమీద య వ లు: ద్రుతంమీద యడాగమ, వడాగమాలు చేయటంకూడా క్రీ.శ. ఏడో శతాబ్దం నుంచి కనిపిస్తుంది. అంటే పదాది యవలు ఆనాటినుంచి వాడుకలో ఉన్నాయని అర్థం, ఉదా. యడాగమం: పఞ్చమియు- యాదిత్యవారంబు (JAHC 3.16-21.9-11, 641), విషయంబు యేళు (SII 10.23.4,719-20), పడుమట-యేడు (పై. 6.250.4,742-98), వడాగమం : ఇఱ్లకా వెఱుగువారు (ఆం. ప. 1941-42, 14-15.2-3, 600-25), పోటున-వకొట్టి (SII 10.614.5-6, 8), రట్టగుడియు-వుద్దిని (EI 30.280-84. 12,972). ప్రథమాంత శబ్దాలమీద కూడా పదాదియకారాన్ని నిలపటం ప్రాచీన కాలంలో ఉండేది, ఉదా. సంవత్సరమ్బుళ్ + యేనగు (పై. 27.234-36.6-7, 625-50).

3.28. విరూపసంధులు: తత్సమశబ్దాలకు తెలుగు పద్ధతిలోను, తెలుగు మాటలకు సంస్కృత పద్ధతిలోను సంధిచేయటం అక్కడక్కడ కనిపిస్తుంది, ఉదా. నీలీస్వర (SII 10. 652.6, 1095), మన్చ్యుణ్ణ (EI 17.334-337.11, 610). రెండో శబ్దం విషయంలో ఇదొక్కటే ప్రయోగం నన్నయనాటివరకున్న శాసనాల్లో కనిపిస్తుంది. కాని తరవాతికాలపు ప్రయోగాల్లోని 'గొఱ్య, గొఱ్ఱె; పళ్యాలు, పళ్యెము, పళ్లెం' మొదలైన శబ్దాల్లో గోచరించే *ఎ ధ్వని ఇందులోనూ ఉందని గుర్తించవచ్చు. 'కళ్యాలు' వంటి శ్రీనాథప్రయోగాలను ఇక్కడ అనుసంధించుకోవాలి (చూ. ఈ గ్రంథంలోనే కందప్పచెట్టి 5.7)

పదమధ్యసంధులు: ప్రత్యయం పరమైనప్పుడు ప్రాతిపదికల్లో వచ్చే మార్పులన్నీ పదమధ్య సంధులే అయినప్పటికీ, అలాటి మార్పులను ఆయా ప్రాతిపదికలను వర్తించేటప్పుడే ప్రస్తావించటం జరిగింది. సంవృతాక్షరాల్లో (Closed Syllables) రేఫ - ఱకారంగా మారటం ఒక ధ్వని పరిణామం. దీనికి వర్ణభేదకత్వం లేదు, ఉదా. పణ్డ్ఱెడు (SII 10.599.32,625-50), విట్ఱజాల (భారతి 5.935-48.2,675), కొణ్డ్ఱు (SII 10.633.4,8), వాణ్డ్రు (పై. 4.1015. 12, 1084). వాణ్ణు మొ. చోట్ల రేఫకు ముందు డకారా