64 తెలుగు భాషాచరిత్ర
ఉదా. సంధికి-ఇడ్డట్లు (ళా. ప. మం. 1.2-3.41, 898-934); విసంధికి- పన్నస ఇరవది. (EI 27.225-28. 12-13. 575-600). యడాగమానికి-కలయన్త (SII 6.585.11, 633-63); విరళమైన వడాగమానికి- ఎఱ్ఱ వుమ్మయును (పై. 10.29.18, 971).
ఇత్సంధి ప్రాచీనమై క్రీ. శ. 9/10 శతాబ్ది వరకు యడాగమం వికల్పంగా ఉండి తరవాత బహుళమయింది. ఉదా. సంధికి-శ్రీ కెల్లన్ (తె. ళా. 1.163-65. 41-42, 892.922); విసంధికి-ఇరుపజయది ఏను (AR 392/1904. 11-13, 575-600); యడాగమానికి-ఇరవది యాదినాల్కు (EI 27.225-28 575-600). ఉత్సంధి మొదటినుంచీ బహుళంగానే ఉండేది. క్రీ. శ. ఏడో శతాబ్ది నుంచి యడాగమం కనిపిస్తూ పదకొండో శతాబ్దికి బహుళవ్యాప్తికి వచ్చింది. అంటే ఉత్సంధి నిత్యం కాకపోగా వైకల్పికంగానే ఉండేదని అర్థం. ఉదా. సంధికి- ఊడ్లందు (SII 6-585.9,633-63); విసంధికి- రేనాణ్డు ఏళన్ (EI 27.221-25.4-5, 575-600); యడాగమానికి - వారు యిఱ్లకాను (SII 6.584.10, 641). పదాంతాచ్చులు హల్లుకు ముందుకూడా లోపించటం విరళంగా ఉండేది. ఉద్దా. అన్వారు (ఆం. ప. 1941-42. 5, 625-50). నల్తుముడ్లు (AR 232/1949-50.9,8). శాస్త్రీయంగా చెప్పాలంటే హలంత శబ్దాలమీద అజాగమం రాలేదనాలి. ఏకాక్షరధాతువుల తుదిహల్లుకు అచ్చులముందు క్రీ. శ. ఏడో శతాబ్ది నుంచి ద్యిరుక్తత కనిపించేది. ఉదా. అన్నేణ్టన్ (భారతి 23.182-86.5, 641). నన్నయగారి 'అన్నిష్టసఖి' ఈలాటిదే.
3.25 గసడదవాదేశం : గసడదవాదేశం క్రీ. శ. 8-11 శతాబ్దుల మధ్య నిత్యంగాను, అంతకుముందు వైకల్పికంగానూ ఉండేది. డాదేశానికి శాసనస్థ నిదర్శనాలు దొరకలేదు. ఉదా. సంధికి : ఆణతి-గాను (EI 27.234-36.15 625-50). పణి-సేసిన. (SII 6.584.5,641), స్థితి-దప్పి (ళా. ప. మం. 1.2-3.39, 898-934), ఏను-వుట్లు (SII 6.585.10, 633-63). విసంధికి : రెండు-తోటళు (EI 27.234-36.11, 625-50). ఆడ్లు - పట్టు (భారతి 5.935-968.8-9, 675). ఈ ఆదేశం సంప్రదాయ వ్యాకరణాల్లో చెప్పిన దానికన్నా ఎక్కువ వ్యాప్తిలో ఉండేది.