59 ప్రాచీనాంధ్రం : శాసన భాషా పరిణామం
తున్నాయి. క్రీ. శ. తొమ్మిదో శతాబ్ది నాటి ఒక శాసనంలో 'తన' శబ్దానికి బదులగా 'తణ' (SII 10.639.11,825) అనే విలోమ లేఖనం కనిపిస్తుంది. ప్రాచీన ణకారం లేఖనంలో క్రీ. శ. పదకొండో శతాబ్దిదాకా అక్కడక్కడ కనిపించినా (కొణం, పై. 647.30,1097) ధ్వనిపరిణామం తొమ్మిదో శతాబ్దికే పూర్తయిందనాలి.
3.13 పదమధ్య డ, ణ, లు: ఆజ్మధ్యడకారం కొన్ని రూపాల్లో ణకారంగా మారటం క్రీ. శ. ఏడో శతాబ్దిలో పల్నాటి సీమలో ఆరంభమయిందని నిరూపించవచ్చు. ఉదా, కొడికిం (EI 15.249-52.17, 554) : కొణెకి (పై 31.74-80. 21,669). ఇది ధ్వనిసూత్రం కాదు. అందువల్ల ఈ మార్పు భాషలో పర్యాప్తంగా లేదు.
3.14. సాధుశకటరేఫలు : పెదవేగిశాసనంలో 'అఱుతొఱె' (భారతి 1 110-22, 10-11 395-410), 'చెఞ్చెఱువ' (పై 13-14), “కమ్బరాఞ్చెరువ" (ఫై.15) అనే మాట లున్నాయి. రెండో మాటలో ఉన్న శకటరేఫ అదే పదంలో మూడో మాటలో లేదు, అందువల్ల ఆప్పటికి చాలాముందు కాలంలోనే ఆ రెండు ధ్వనులూ ఒకే వర్ణంగా మారాయని చెప్పవచ్చు. క్రీ. శం ఏడో. శతాబ్టినాటి. 'ఇరుకుటూరు” (EI 31. 74-80, 39-40, 669), ఎనిమిదో శతాబ్దినాటి 'చిట్టేరు' (JAHRS 5.51-56.19,763) 'నూరు' (SI 10.37.2.8) వంటి మాటల్లో శకటరేఫ లేదు. అదే కాలంలోని 'పడమఱలూఱి' (పై. 605. 1-2 8) అనే పదంలో 'ఊరు' శబ్దంలో ఉండరాని శకటరేఫ వచ్చి చేరింది. పైవాటిలోని ఏడో శతాబ్దిపదం పల్నాటిది. ఎనిమిదో శతాద్ది రూపాలు విశాఖనుంచి అనంతపురం వరకున్న భూభాగాలవి. అందువల్ల రేఫ అకారాల భిన్న వర్ణత్వం అజ్మధ్యంలో క్రీ. శ. ఏడో శతాబ్దికిముందే మధ్యాంధ్ర దేశంలో లోపించటం మొదలుపెట్టి ఎనిమిదో శతాబ్దికి దేశమంతా అల్లుకుపోయిందని చెప్పవచ్చు.
3.15. పదమధ్య ల, ళ లు : మూలద్రావిడ *ళకారం కీ. శ. ఏడో శతాబ్దికే లకారంగొ మారటం మొదలుపెట్టి తొమ్మిదో శతాబ్దికి వూరర్తిగా మార్పు చెందింది. నరసరావుపేట తాలూకొలోని ఒక శాసనంలో 'కొలచి (పై. 6.250 7,862-98) అనేరూపం కనిస్తుంది. అయితే ఏడో శతాట్దికే ప్రాదీన ద్రావిడ *లకారం ఉండవలసినచోట ళకారం రాయటమనే విలోమలేఖన పద్ధతి