Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

60. తెలుగు భాషా చరిత్ర

వచ్చినందు వల్ల *ళకారం లకారంగా అప్పటికే మారిందనాలి. ఉదా. ఆయ్యవోళు (భారతి 16.613-19.13, 691-92), కళర్‌ (పై. 5.935-48. 13,675), తళవర (EI 31.74-80. 22,669)

3.16. పదమధ్య ఱ, డ లు : అఙ్మధ్య ఱకారం క్రీ. శ. ఏడో శతాబ్దికే డకారంగా మారింది. చోఴ (పై. 27. 229-30. 1,600-25), కుడుచు (SII 6.584.10,641) వంటిది ఇందుకు నిదర్శనాలు.

3.17. వర్ణసమీకరణం I : ప్రాచీనాంధ్రంలో వర్ణసమీకరణం కారణంగా అఙ్మధ్యంలో ద్విరుక్తమైన క,గ,చ,ట,డ,ణ,త,ద,న,ప,మ,య,ఱ,ల,ళ,వ,స లు ఏర్పడ్డాయి. ఈమార్పు సాహిత్యం ఏర్పడటానికి ముందు కాలంలో జరిగిందని బరో (BSOAS 11.129), కృష్ణమూర్తుల (1961, && 1.179-80) అభిప్రాయం. శాసనాధారాలను బట్టి క్రీ. శ. నాలుగో శతాబ్ది నాటికే ఈ మార్పు వచ్చినట్టు చెప్పవచ్చు. ఈ సమీకరణం రెండు విధాలు: (i) (హ) అహ-హ > (హ)అ-హహ. ఉదా. ఇచ్‌-చిన(EI 27.225-28.4 575-600). (ii) (హ) అహ- అ>(హ) అహహ- ఉదా. కొట్ట్‌-ఊరు (నర్కార్‌, 1942, 1.256 -57.19, 330-75). ఈ మార్పు చెందని *పెర్దల్‌, (రా. ప. సం. 71-72.27,847) వంటి రూపాలు క్రీ. శ. పదకొండో శతాబ్ది దాకా క్వాచిత్కంగా లేఖనంలో నిలిచినా, ధ్వనిపరిణామం మటుకు అప్పటికి ఏడెనిమిది శతాబ్దుల కిందనే ఆరంభమయింది.

3.18. అఙ్మధ్య ద్విరుక్త హల్లులు : ద్విరుక్తణకార ళకారాలు కూడా చారిత్రక కాలంలోనే ద్విరుక్త నకార లకారాలుగా మారిపోయాయి. క్రీ. శ. ఎనిమిదో శతాబ్దిలోని 'కొణ్ణ' (SII 10.611.2) అనే శబ్దం 9/10 శతాబ్దికి 'కొన్న' (తె. ళా. 0.163-65. 70-71, 881-922)గా మారింది. క్రీ. శ. పదో శతాబ్దిలో కూడా 'అణ్ణ' (EI 30.280-84.7, 972) వంటి రూపాలు లేఖనంలో నిలిచినా, ఆనాటికే ధ్వని పరిణామం పూర్తయినట్లే. అఙ్మధ్య ద్విరుక్త ళకారం క్రీ. శ. ఎనిమిదో శతాబ్దికే ద్విరుక్త లకారంగా మారింది. ఉదా. పళ్ళి (పై. 31.74-80. 21.669), -పల్లి (CP 2, 1914-15. 26, 764-99).

    3.19. వర్ణసమీకరణం II : ఆజ్మధ్యంలోని భిన్న హల్లులు సమీకరణం పొందినందు వల్ల చారిత్రకకాలంలో అజ్మధ్య సంయుక్త హల్లులు