Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

53. తెలుగు భాషా చరిత

5.51-56.21,763)> ప్రా- * వ్ఱ> వ్రచ్చిన (SII 10.599,26, 625-50). క్రీ. శ. 4/5 శతాబ్ది నాటి-తొఱె శబ్దం. (భారతి 1.110-22.11, 395-410) క్రీ. శ. పదో శతాబ్ది నాటి త్రోవ (EI 5.139-42.27, 945-70) కు పూర్వరూపం. మాధ్యమిక రూపం *త్ఱోవ అని ఉండవచ్చు. అంటే క్రీ. శ. పదో శతాబ్దికే సంయుక్తాక్షరగతమైన శకటరేఫ సాధురేఫగా మారిందని భావించవచ్చు. పదాది సంయుక్తాక్షరగతమైన సాధురేఫ క్రీ. శ. పన్నెండో శతాబ్ది మధ్యకాలంలో రాలిపోయి ఉంటుందని పూర్వులు విశ్వసించారు. (కృష్ణమూర్తి 1961 && 1.145). అయితే ఈ మార్పు క్రీ. శ. ఏడో శతాబ్ధంలోనే మొదలయిందనటానికి కొన్ని నిదర్శనలు లభిస్తున్నాయి. ఉదా. అయ్యవోళు (భారతి 16.613-19.13,691- 92), గొచ్చి (SII 10.621.3, 9/10), పోలమ (పై. 620.5,914), పప్పు (ఫై. 4.1015.9, 1084) మాని (పై. 10.646.29, 1062). కాని ఈ మార్పు బహు విరళంగా ఉండేదని, చారిత్రక కాలంలో పూర్తి కాలేదని చెప్పాలి.

3.10. పదాది య, వలు: పదాది యికారవకారాలు క్రమంగా క్రీ. శ. 8 వ శతాబ్దులనుంచే లేఖనంలో కనిపిస్తున్నాయి. ఊదా. (i) యుళ్లలూరు. (EI 9.233-3 6.20 426), యలమ్మ (SII 10.29.16,971) (ii) వకొట్టి (పై. 614 6,9) వుద్దిని (EI 30.280-84. 12,972), ఇవి వర్ణాత్మకలేఖనంలో తొలిగిపోతాయి.

3.12 పదమధ్య గ, వ లు: పదమధ్యంలో ప్రత్యయాత్మక గ, వ కారాలు మారుపాటు పొందటం శాసనభాషలో కనిపిస్తుంది. ఈ మార్పుల్లో ఏది ఏ ప్రాంతంలో ఆరంభమయిందో చెప్పలేముగాని, క్రీ.శ. పదకొండో శతాబ్దంలో ఇవి పరస్సరం మారిన వనటానికి సాక్ష్యముంది. ఉదా. (i) -గ->-వ-: నాలుగు (NI 3.1151.6-7, 650) నాలువు (SI 4.1029.10.1100). (ii)-వ->-గ- దణ్డువు (భారతి 5.618. 7,897), దణ్డుగు (CIT 26.13, 1079).

3.12 పదమధ్య న,ణ లు: మూలద్రావిడ *ణకారం. తెలుగులో నకారంగా మారింది. ఈ మార్పు క్రీ. శ. ఏడో శతాబ్దిలో మొదలై తొమ్మిదో శతాబ్దికి పూర్తయినట్టు తెలుస్తుంది. ప్రొద్దుటూరు తాలూకాలో దొరికిన క్రీ. శ. 626-50 నాటి ఓక శాసనంలో ణకార యుక్తమైన 'ఆణతి' (EI 26.234-36.15), నకారయక్తమైన 'పని' (.32) అనే. రెండు రూపాలూ దొరుకు-