Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

58. ప్రాచీనాంధ్రం: శాసన భాషాపరిణామం


హ్రస్వదీర్ఘభేదం లిపిలోనే లేదు. ద్విత్వాక్షరాలకు బదులుగా ఒకే హల్లును ఉపయోగించటం, మహాప్రాణాలకు ముందున్న ఆల్పప్రాణాలను వదిలివేయటం, అనుస్వార చిహ్నంగా ఉన్న చుక్కను కాలక్రమంలో భిన్న స్థానాలకు మార్చటం వంటి అనేక ప్రత్యేకతలు ఆనాటి లిపిలో కనిపించేవి. ఆందువల్ల అనేక భిన్నపాఠాలూ అపపాఠాలూ బయలుదేరి పాఠపరిష్కరణ కష్టసాధ్యమయింది. 3.2 లేఖన పద్ధతులు: రేఫ తర్వాత, బిందువు తర్వాత, ద్విరుక్త హల్లులు రాయటం ఆనాటి లేఖనసంప్రదాయంగా ఉండేది, రేవమీది హల్లును ద్విరుక్తం చేయటమనే పద్ధతి ఆర్యభాషా సంప్రదాయం నుంచి, ఎరువుగా వచ్చింది. ఉదా. తూప్పు౯న (SII 6.584. 8,641), కాత్తి౯య (EI 27. 231-34. 8,625-50). ఈ అలవాటు క్రీ.శ. 11 శతాద్దినుంచి క్రమంగా తగ్గుతూ వచ్చింది. అనుస్వారంమీది పరుషాలను ద్విత్వంచేసే ఆచారం క్రీ. శ. 9-10 శతాబ్దుల నుంచి మాత్రమే కనిపిస్తుంది. ఉదా. ఱంక్క. (తె. శా.1.163-165.59,892-922), గుంట్ట (IA 13.50,58,918-25). ఇది చారిత్రాకకాలంలోనే ఆరంభమైన దేశీయాచారం. క్రీ. శ, 11 శతాబ్ది వరకూ ఈ పద్ధతి విరళ ప్రచారంలోనే ఉండేది.

3.3. లేఖన దోషాలు : శాసనభాషలో అనేకవిధాల లేఖనదోషాలు కనిపిస్తాయి. శిల్పుల ఆజ్ఞానంవల్ల, ఆశ్రద్ధవల్ల వచ్చేవికొన్ని, శాసనకర్త భాషకూ శిల్పిభాషకూ గల భేదాలను నిరూపించేవి కొన్ని, లిఖిత వాగ్వ్యవహారాల మధ్య ఉన్న సంబంధం సూచించేవి కొన్ని, కాసన పాఠకుల అశద్ధవల్ల కలిగిన దోషాలు కొన్ని-ముఖ్యంగా నాలుగు రకాల దోషాలు కనిపిస్తున్నాయి. ఉదా. (అ) శిల్పి కృత దోషాలు: ఆగ్( = అగ్భ, 50 10.68.98, 9/10); తజ్కి (= తాజ్క, వై. 828.8, 9/10); దేగులలంబును (డాగులంబును. వై 8.115255. 2526, 7); నాంజ్దు (= నాండు/నాడ్డు, అం. చొ, నొం. వు, ౨16.21.11,. 678), బైయ్లుమ్బ (= బైదుమ్చు/బయమృ,_ ౨0 24 180 198.2.825); వాజ్జేన (వాజ్జైన్స 5/1, కలి! 68,1070). (అ) భాషా మూలకదోషాలు : ఎడ్డుకు (= ఎడ్లకు, 5005. 77. 108); ఒక్తాడు బోళచేత (= ఒకంన అం, వ. 1041=42, 1415 2,600-25); వకొట్టి చల్దుర (కౌందటు -, 500 10.614.0,9 |. ౨. వేవుగ్గణావిలాక (ఇువేయి తవిళాలు, వై.-696.17,.. 1025-50). (ఇ) ఉచ్చారణ సూచకాలు : గోళ్ళ