Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణం 3

ప్రాచీనాంధ్రం: శాసన భాషా పరిణామం
(క్రీ. పూ. 200-క్రీ. పూ. 1100)

-బూదరాజు రాధాకృష్ణ


3.0. ఆధారాలు : ప్రాచీనాంధ్రభాషాస్వరూపాన్ని గుర్తించటానికి శాసనాలు తప్ప వేరే ఆధారాలు లేవు. ఈ అధ్యాయంలో క్రీ. పూ 200 నుంచి క్రీ శ. 1100 వరకూ ఉన్న 269 శిలాతామ్రశాసనాలను పరిశీలించి భాషా చరిత్రను నిరూపించటం జరిగింది. వీటిలో 217 శిలా శాసనాలు; 52 తామ్ర శాసనాలు. వీటిలో, 255 మాత్రమే ప్రచురితమైనాయి. ప్రచురితాల్లో 187 కొద్ది భాగాలు మినహా మొత్తంమీద తెలుగులోనే ఉన్నాయి; మిగిలిన 68, స్థలనామ. వ్యక్తినామాదులు మాత్రమే తెలుగులో ఉన్నాయి. ఆంధ్రేతరభాషాశాసనాలు పూర్తిగా తెలుగు వాక్యాల్లో ఉన్న మొట్టమొదటి. శాసనం క్రీ శ. 575 నాటిది. లిపినిబట్టి, శాసనకర్తలను గురించి చరిత్ర కందిన ఇతరాధారాలనుబట్టి, ఇవన్నీ ఏ కాలానివో నిర్ణయించదగ్గవి. అలాటి. నిర్ణయానికి ఆందని శాసనాలు , మరికొన్ని.ఉన్నా వాటి నిక్కడ పరిశీలించటంలేదు. అముద్రితప్రాచీనశాసనాలు రెండు మూడు వందల దాకా ఉన్నప్పటికీ వాటిలో ఉపయుక్త మనిపించిన పధ్నాలుగింటిని మాత్రమే పరిశీలించాం.*

3.1. లిపి : క్రీ. పూ. 200 నాటి శాసనం 'భిట్టిప్రోలు / ద్రావిడీ' శాఖకు చెందిన బ్రాహ్మీలిపి'లో ఉంది. పరిశీలితశాసనాల్లో కొంతభాగం దేవ నాగరిలోను మిగిలింది తెలుగు-కన్నడ లిపీలోనూ ఉన్నదొకటి, వేంగీచాళుక్య లీపీలో ఉన్నవి నాలుగు ఉన్నాయి. ద, డ-లకు, ళ, డ-లకు, (ఱ)ఱ-లకు, థ, న్ఱ-లకు లిపిలో సాన్నిహిత్యం ఉండేది. ఈ, ఊ లకు తప్ప ఇతరాచ్చులకు సాధారణంగా దీర్ధత గుర్తించబడేదికాదు. ఎ ఏ, ఒ ఓ, లకు

∗ ఈ అధ్యాయం బూదరాజురాధాకృష్ణ అముద్రిత పరిశోధనవ్యసానికి సంగ్రహరూపం.