54. తెలుగు భాషా చరిత్ర
(-గోత్ర, పై. 644. 47,1060); తళ్చి (= తల్చి, పై. 598,58,925-50); ఖఴ్గ(=ఖడ్గ, తె.శా. 1.163-65. 11.892-922). (ఈ) పాఠక కృతదోషాలు: ఒగోం డు (=ఒంగోడు, EI 5.249-252. 17,554); పిదెన (=పిడెన, పై. 9.236-41.29,673); చెఴిచిన (= చెఱిచిన, SII 10.598 .58,925-50); తెల్కొన్థ (=తెల్కొన్ఱ IA 7.185-191.13,668-69); ఉత్తరయాన (=ఉత్తరాయన, రా.వ.సం. 187-88. 21-22,1018)
3.4. వర్ణమాల : ఆల్పసంఖ్యాకమైన పైదోషాలను విస్మరించి మిగిలిన భాషను పరిశీలించినప్పుడు ప్రాచీనాంధ్రంలో 23 హల్లులూ 10 అచ్చులూ గల దేళ్యవర్ణమాల ఉన్నట్టు తెలుస్తుంది. క,గ,ఙ,చ,జ.ట,డ,ణ,త,ద,న, ప,బ, మ,య,. ర,(ఱ),ల,శ,వ,స,హ,(ఴ), అనేవి హల్లులు. వీటిలో ఱ, ఴ లు చారిత్రక కాలంలోనే వర్ణత్వాన్ని కోల్పోయినాయి. అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఎ, ఏ, ఒ, ఓ అనేవి అచ్చులు, 'ఆయ్, అవ్' లతో భేదకత్వంలేని 'ఐ,ఔ' లు ప్రత్యేకవర్ణాలు కావు. అరసున్న సంధిగత వర్ణం. పఞ్చిన (రా. వ. నం. 71-72.25, 847), పన్చిన (భారతి, 5.618.7, 850) శబ్దాలను పోల్చినప్పుడు ఞకారం నకారానికి సవర్ణమని తెలుస్తుంది. మొడత్స (రా. వ. నం. 187-89, 1018) శబ్దంలోని 'త్స' ౘకారానికి బదులుగా రాసింది కాబట్టి ఆనాటికి ఉచ్చారణలో ౘకారం ఉందని చెప్పవచ్చు. ౘౙ లు చ జ లకు సవర్ణాలని కూడా ఊహించవచ్చు. నిండుసున్న వర్గానునాసికాలకు పర్యాయసంకేతమేగాని ప్రత్యేకవర్ణం కాదు. సంస్కృత, ప్రాకృతాల ప్రభావం వల్ల తెలుగులోకి వచ్చిన సహవర్ణాలు మరికొన్ని ఉన్నాయి. ఖ, ఘ, ఠ, థ, ధ, ఫ, భ,శ, ష, లు కనిపించినా ఠకారం ,ప్రత్యేక వర్ణమనదగ్గ శాసనస్థనిదర్శనం లభించలేదు. ౠ,ఌ, ౡ, లకు ప్రయోగమే లేదు. ఋకారానికి 'రి'కి భేదం లేనందువల్ల అది ప్రత్యేకవర్ణం కాదు.
3.5 వర్ణవ్యాప్తి : శాసనభాపలోని వర్ణవ్యవస్థలో కనిపించే కొన్ని ముఖ్యవిశేషాలివి. దీర్ఘాచ్చు మీద ద్విరుక్ర హాల్లుగాని. 'ఓ' తర్వాత సంయుక్త హల్లుగాని కనిపించవు. జ, ఞ, ట, ణ, హ-కారాలు పదాదిన లేవు. పదాది ళకారం ఎ, ఒ-కారాలకు ముందు, పదాది ఴకారం అకారానికి ముందు, మాత్రమే కనిపిస్తాయి. రేఫతో సంయుక్తమైన క, త, ద, ప, బ, మ, వ లు మాత్రమే పదాదిన కనిపిస్తాయి, ఉ.దా. క్రొచ్చె (SII 10.597.21-22, 925-50),