ఈ పుట అచ్చుదిద్దబడ్డది
48. తెలుగు భాషా చరిత్ర
కూయిలో భూతవ్యతిరేక ధాతుజవిశేషణు, భవిష్యత్ వ్యతిరేకధాతుజవిశేషణం అని రెండు వ్యతిరేక ధాతుజవిశేషణాలు ఉన్నాయి. వీటిలో మొదటిది క్రియకి-? అతి- చేర్చడం వల్లా, రెండవది -? అని చేర్చడం వల్లా ఏర్పడతాయి. తెలుగు - అని ప్రత్యయానికి కూయి -? అని ప్రత్యయానికి కూయిలో కంఠమూల స్పర్శం తప్ప వేరే భేదం లేదు. ఉదా: కూయి తిన్? అని? తె. తినని, కూయి సూడ్ ? అని: తె. చూడని. ఈ ధాతుజ విశేషణంలో విశేషణ ప్రత్యయంగా మిగిలిన భాషల్లో అకారం ఉండగా తెలుగు, కూయిలలో ఇకారం- ఉండడం కూడా ఈ రెండు భాషల మధ్య సన్నిహితత్వాన్ని నిరూపిస్తుంది 2.52. చేదర్థకం. తెలుగులో క్రియకి - ఇనన్ చేర్చడం వల్ల చేదర్థకం ఏర్పడుతుంది. ఇందులో -ఇన్- భూతప్రత్యయం, -అన్ చేదర్థక ప్రత్యయం. -ఇన్- తమిళంలో స్పర్శంతో అంతమయ్యే క్రియలలో భూత ప్రత్యయమైన -ఇన్- (చూ. 2.48) కి సంబంధించినది. తెలుగులో ఇది *-త్-* -న్త్-, * -త్త్- అనే మూడు ప్రత్యయాల్ని తొలగించి వాటి స్థానాలకి కూడా వ్యాపించినట్టు ఇంతకుముందే చూశాం. చేదర్థక ప్రత్యయమైన -ఆన్ మూ. ద్రా. *అవ్ (త. మ. *-ఆల్) నించి వచ్చింది. ఉదా. త. పాటినాల్ : తె. పాడినన్, త. నంపినాల్ : నమ్మినన్. వ్యావహారిక భాషల్లో ఈ రూపాల్లో అంత్య నకారం లోపించి, దానిముందు అచ్చు దీర్ఘమై ఏర్పడిన పాడినా, నమ్మినా మొదలైన రూపాలు (Concessive meaning) నేటికి నిలిచి ఉన్నాయి. వ్యావహారిక భాషలో -ఇతే/-తే/-టే అనే ప్రత్యయంలో ఏర్పడే చేదర్థక రూపాలు ప్రాచీనాంధ్రంలో మధ్యమ పురుషైకవచన భూతకాల రూపంలో ఏని (త. ఏల్ < * ఆకిల్ 'అయితే') అనే శబ్దం చేరగా ఏర్పడిన రూపాల నించి వచ్చినవి. ఉదా. వ్యా. అంటే < ప్రా. ఆంటి(వి) + ఏని. 2.53. విధ్యర్ధకాలు (మధ్యమపురుషైకవచన, బహువచనాలు). తెలుగులో విధ్యర్థక మధ్యమపురుషైకవచన ప్రత్యయం - ము. అనేకాచ్క ధాతువులలో అచ్చు పరమైనప్పుడు తప్ప మిగిలిన చోట్ల ఇది వైభాషికంగా లోపించవచ్చు. విధ్యర్థక బహువచన ప్రత్యయం -ఉండు. విధ్యర్థక రూపనిర్మాణంలో తెలుగుకీ గోండీ, కొండ, కూయి, కువిలకీ ఎంత సన్నిహిత సంబంధముందో ఈ కింది పట్టిక నిరూపిస్తుంది.