పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

49. తెలుగు : మిగిలిన ద్రావిడ భాషలు

ఏ.వ. బ.ప.
తెలుగు -(ము) -ఉండు
గోండీ -ఆ (~-మ్‌-) -ఆ(-~-మ్‌-) + ట్‌
కోయ -అ (~-ము) -అ(~మూ-)+ టి(~-టు)
కొండ -? అ -దు (~-డు~-ఱు)
కూయి -ము(-అము- ఉము) -అటు - దు (~-డు~-డు)
కువి -ము(- -అము) అదు*దు (~-జు)


    పై భాషలన్నిటిలోనూ మకారం (కొండలో తప్ప) ఏకవచన ప్రత్యయం గానూ, టకార దకారాలు బహువచన ప్రత్యయంగానూ ఉన్నాయి. కాని మిగిలిన ద్రావిడ భాషల్ని పరిశీలిస్తే విధ్యర్థకైకవచనరూపంలో ప్రత్యయమేమీ లేకుండా క్రియ మాత్రమే ఉండి, బహువచన రూపంలో మకారం ప్రత్యయంగా ఉంటుంది. ఉదా. త చెయ్‌ 'చెయ్యి' చెయ్యుమ్‌ (కళ్‌) 'చెయ్యండి', కోత తిన్‌, 'తిను', తిన్ మ్, 'తినండి'. ప్రాచీన కన్నడం గెయ్‌ 'చెయ్యి', గెయ్యిమ్‌ 'చెయ్యండి”, తిన్‌ 'తిను', తిన్నిమ్‌ 'తినండి'. బ్రాహుయీలో విధ్యర్థక బహువచన ప్రత్యయమైన-బొలో ఐకారం కూడా ఈ మకారం నించి వచ్చినదే కావచ్చు. దీని వల్ల మొదట్లో మకారం బహువచన ప్రత్యయమే. అని తేలుతుంది. ద్రావిడ భాషల్లో అత్మార్థక యుష్మదస్మదర్థక సర్వనామాల్లో (చూ. 2.38-40) బహువచన ప్రత్యయం మకారమే కావడం కూడా ఈ ఊహని బలపరుస్తుంది. తెలుగు, గోండీ, కూయి మొదలైన భాషల్లో మొదట్లో బహువచన ప్రత్యయమైన మకారం ఈ భాషల్లో ట/ద అనే ఒక కొత్త బహువచన ప్రత్యయం వచ్చి చేరడం వల్ల ఏకవచన ప్రత్యయంగా మారిపోయింది. ప్రాచీనాంధ్రంలోనూ కువిలో కొన్ని మాండలికాల్లోనూ మకారం వైకల్పికం కావడం కూడా ఇది మొదట్లో ఏకవచన ప్రత్యయం కాదు అనే విషయాన్ని ధ్రువపరుస్తుంది.                               
                                                                        
                 ఏ.వ.          బ.వ. 
  (i) గోండి       సీమ్‌          సీమ్‌ట్‌
      కోయ       ఈము         ఈమూటు
      తెలుగు     ఇమ్ము          ఇండు                                  
                                                                       
(4)