తెలుగుభాషాచరిత్ర : సింహావలోకనం 373
లోపించి ఈ కింది ధ్వని పరిణామం అప్పటికే సామాన్యుల వాడుకలో వచ్చి ఉండాలి :
(29) (చ్) చ --> స /-త
చ వర్ణం (ద్విరుక్తమై నా, అద్విరుక్తమైనా)తవర్ణం పరమైనప్పుడు 'న'గా మారుతుంది.
విధేయ విశేషణాల్లో 'వ' కారలోపం 11 వ శతాబ్దిలోనే ఆరంభమై 12, 13 శతాబ్దులకల్లా ప్రచురమైంది; ఇచ్చిన వాణ్డు > ఇచ్చినాణ్డు (క్రీ. శ. 1096) (§ § 3.44, 4.53). 'చేస్తుంది' (క్రీ. శ. 1275) అనే రూపం వర్తమానక్రియగా 'తు' ప్రత్యయంతో మొదటిసారి శాసనాల్లో కనిపిస్తుంది (§ 4.56). 'చు' వర్ణం కంటె చరిత్రకంగా 'తు' వర్ణం ప్రాచీనమైనట్టు తులనాత్మక విధానంవల్ల మనకు తెలుస్తుంది. 'చేయుచు' వంటిరూపాలు ఒకానొక వర్గమాండలికం నుంచి కావ్యభాషకు ఎక్కిఉంటాయి. (§ 4.56). 'ఇనన్' అవ్యర్థంలో 'ఇనాను' గా మారింది; ఆ తరవాత తుది “న లోపించింది, ఉదా, ఆమ్మినాను (క్రీ. శ. 1269), (§ 5.49); చేదర్ధంలో -ఇతే (ను) 13వ శతాబ్ధిలో కనిపిస్తుంది, పోయితేను (క్రీ.శ. 1250), చేస్తే (క్రీ.శ. 1252) (§ 4.56). వర్తమాన భవిష్యదర్ధంలో వచ్చే - ఎద-, 15 వ శతాబ్దికే -ఏ-గా మారిన ఆధారాలున్నాయి. ఉదా. సేసేరుగాన (క్రి శ 1444) ధరించేము (క్రీ. శ. 1615. అన్నమాచార్యుల కీర్తనలలో ఇలాటి రూపాల వాడుక బహుళం.
విధేయ విశేషణాలు 16 వ శతాబ్దికి సమాపకక్రియలై న ఆధారాలున్నాయి. (§ § 4.59, 5.47, 61), వర్తమానార్థక క్రియలు ఇప్పటి భాషలోలాగా ఉన్నవి 15వ శతాబ్దికే ప్రచురంగా కనిపిస్తాయి, ఉదా సేవసేస్తున్నాండు (క్రీ. శ. 1453 (§ 5.47). క్రియాజన్య విశేషణ ప్రత్యయం 'ఎడి', 14 వ శతాబ్దికే 'ఏ' అయింది. ఉదా. రక్షించేది. ఇతర క్రియాజన్య విశేషణ్డా (భూత వ్యతిరేకా) ల్లో మార్పులేదు.
ఎన్నాళ్ళో జనుల వాడుకలో ఉండి మరుగుపడి ఉన్న తద్ధర్మ భవిష్యదర్థక -తా- ప్రత్యయం మొదటిసారిగా 16వ శతాబ్దిలో శాసన భాషలో గోచరిస్తుంది. ఉదా. చేస్తారు (క్రీ.శ. 1551) (§ § 6.38. 7.28). ఈనాటి భాషలో చేశాడు, చేసినాడు, చేసిండు, మొ.న సమాపకక్రియలకు 'వ' కారం లోపం వచ్చిన విధేయ విశేషణాలే మూలరూపాలు. ఈ కారణం వల్ల 'చేసెను, చేసితిని' వంటి రూపాలు వ్యవహార భ్రష్టమైనాయి (§ 6.36)