Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/487

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

472 తెలుగు భాషా చరిత్ర

హత్తులో అది/దాని-, ఇది/దీని- పూర్వరూపాలు *అతు/అత్‌ - అన్‌ - ఇ,

  • ఇత్తు / ఇత్ - అన్ - ఇ గా ఉండేవి. ఇక్కడ - అన్‌ - ఇ ద్వితీయాది విభక్తుల్లో

చేరే ఆగమం.

పై నిరూపించిన సర్వనామాల్లో కొద్దిపాటి ధ్వని పరిణామాలు తప్ప చారిత్రక కాలంలో వచ్చిన కొత్తమార్పు లేవీలేవు. ఈ మార్పుల్లో న్డు > ణ్డు, అనునాసికం > అనునాసిక్యం > లోపం ఈ మార్పులు గుర్తించదగ్గవి (చూ.పైన).

16.15. క్రియలు. తెలుగు పూర్వదశలో క్రియా రూపాలు ప్రా.ద్రా. మాతృకనుంచి ఎన్ని రకాల మార్పులు చెందిందీ మనకింకా స్పష్టంగా తెలియదు. ప్రేరణార్థకంలో-ఇంచు/-ఇంపులు ఎలా వచ్చిందీ ఇంతకుముందు చూశారు. (-16.3) తద్ధర్మార్థంలో వచ్చే ఉను, దు /తు ప్రత్యయాలు ప్రా. ద్రా. నుంచి ఏర్పడ్డవే. ఆధునిక భాషలో కొద్ది క్రియాపదాల్లోనే ఇవి నిల్చి ఉన్నాయి ; ఉదా. రావచ్చు, పోవచ్చు, నాకు పాడటం తెలుసు, ఎరుగుదును, మొ. వి. చేదర్థక వాక్యాల్లోను కొన్ని మాండలికాల్లో ఈ రూపాలు నిల్చి ఉన్నాయి. ఉదా. డబ్బుంటే ఇల్లుకట్టి ఉందును, మొ. వి. వీటి స్థానంలో ఇటీవల 'ఉండేవాణ్ణి' లాటి విధేయ విశేషణాలు ప్రమాణభాషలో వ్యాపిస్తున్నాయి.

వచ్చెదవు, చేసెదవు లాటి ఎదగాగమ రూపాలు 14, 15 శతాబ్దులకే వచ్చేవు, చేసేవు గా మారి భవిష్యదర్థంలో లోపించాయి. ఇప్పుడు కొన్ని మండలాల్లో వీటికి విలక్షణ ప్రయోగం ఉంది. ఉదా. సరిగా నడు, కిందపడేవ్‌ ? ఈత నేర్చుకొండి, నీళ్ళలో మునిగేరు ? వంటివి. తద్ధర్మార్థక ధాతుజన్య విశేషణంమీద 'అది' చేర్చి విధ్యర్థంలో ప్రయోగించటం మొదటినుంచీ కావ్యభాషలోను కనిపిస్తుంది (§ 3.49). ఉదా. నడుపునది (క్రీ.శ. 1069) : విధ్యర్థంలో -ఏ + ది: చేశేది, ఎత్తేది (§5.48). ఈ రూపాలు 14,15 శతాబ్దులకే ఏర్పడ్డాయి. భవిష్యదర్థంలో అన్నంతంమీద వచ్చే 'కల' సామర్థ్యార్థకమై పోయింది. ఇది బహుశా 15, 16 శతాబ్దుల్లో జరిగి ఉండవచ్చు.

16.16. 12 వ శతాబ్దిదాకా కావ్యభాషకు శాసనభాషకు సమాపక-అసమాపక క్రియల్లో ఎక్కువ తేడాలు కనిపించవు. 'ఇస్తిమి' వంటి రూపాలు 12 వ శతాబ్ధికే శాసనాల్లో కనిపిస్తాయి. 'ఇచ్చితిమి' రూపంలో 'చ్చి' లో హ్రస్వాచ్చు