పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/489

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

474 తెలుగు భాషా చరిత్ర

16. 17. ఇంచు/ఇంపుల సపదా౦శత నశించి '-ఇంచు' సర్వత్ర వ్యాపించటం 13వ శతాబ్ది నుంచే కనిపిస్తుంది. ఉదా. జరిగింంచుము (క్రీ.శ. 1214; 4.55). ఉభయ ప్రార్ధనంలో వచ్చే '-దము'. '-దాము, -తాము'లుగా 16వ శతాబ్ది కావ్యాల కెక్కింది, చూతాము, వెదాకుదము (§ 8.20). వ్యతిరేక భూత క్రియ అన్నంతానికి 'లేదు' చేర్చి కూర్చుటం 1600 నుంచే ఉంది, 'సేయలేదు' (§ 6.42). ఆత్మార్థంలో - కొని సంకుచతమై వాడుకలో -క గా మారటం 16 శతాబ్దికే జరిగింది. ఉదా. అనుభవించుక (§ 6.31). విధ్యర్థంలో -వలెను చేరటం గూడా 16వ శతాబ్ధి తరవాతనే, ఉదా. నడిపించవలెను (క్రీ.శ. 1708; § 6.40). కావ్యభాషలో ఎక్కువగా కనిపించే కర్మణ్యర్థక ప్రయోగాలు క్రమంగా విరళమైనాయి. (§ 8.23). శత్రర్థంలో -తూ-తో పాటు -తా- ప్రత్యయం గూడా మాండలికంగా తలెత్తింది, చేస్తూ (క్రీ.శ. 1600), యిస్తా (క్రీ.శ. 1691) (§ 6.43(2)).

16.18 సముచ్చయార్థంలో వచ్చే ప్రత్యయం -ఉమ్‌ (క్రీ. శ. 641) క్రమంగా -ఉను/-ను లుగా మారింది. దీనిలో ఉత్వం దీర్ఘమై ఎప్పడూను (క్రీ.శ. 1008) వంటి రూపాలు 11వ శతాబ్దికే కనిపిస్తాయి. (§ 3.62). పూర్వా చ్చును బట్టి -(ఉ)న్నూ,-(ఇ)న్ని, రూపాలు అర్వాచీనం. 16వ శతాబ్టి తరవాత ను లోపం వచ్చి పూర్వాచ్చు దీర్ఘత సముచ్చయార్దకంగా నిలిచిపోయింది (§ 5.64). దీని పరిణామం ఈ కింది విధంగా సూచించవచ్చు.

  • వాన్డుమ్‌ > వాణ్డును > వాణ్డూను / వాణ్డున్నూ > వాండూ > వాడూ.

16.19. వాక్యరచన. ఇతర ద్రావిడభాషల్లో లాగా తెలుగులో అఖ్యాతం నామపదబంధం కావచ్చు, క్రియాపదబంధం కావచ్చు (§ § 3.70-71). యత్తదర్థక ప్రయోగం, కర్మణిప్రయోగం సంస్కృత పాకృత ప్రభావాలవల్ల తెలుగులో ఏర్పడ్డవి (§ 3.73) ; ఈ ప్రయోగాలు కావ్యభావషలో బహుళంగా కనిపిస్తాయి, ఉదా. అతని చేయంబడిన ధర్మువులు (క్రీ.శ. 892-922) (§ 3.74). సకర్మక క్రియావిశేషణానికి ముందు షష్టిలో కర్తృపదం ప్రయోగించటం ప్రాచీన భాషా లక్షణం, ఉదా. తమ ప్రతిష్ట చేసిన ఈశ్వరాలయంబునకు (క్రీ.శ. 1060), నీ చేసిన యుపకారంబు (క్రీ.శ. 892-922), అతని కొఱ్పి౦చిన చెఱువులు