Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/484

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తెలుగు భాషా చరిత్ర : సింహావలోకనం 469

లకు ప్రచురమైనాయి. (§5.30) 'నుంచి/నించి' - పట్టి 17 వ శతాబ్టి నుంచీ కనిపీస్తున్నాయి. (§6.27(5) §8.6).

16.10. సంఖ్యా వాచకాలు : 1 నుంచి 10 వరకు ప్రా. ద్రా. రూపాలు ఇలాఉండేవి : *ఒన్‌టు/ఓర్‌ ~ ఒరు, ఒక్క '1', *ఈర్‌ ~ ఇరు, ఇరణ్ణు '2' *మూ-.మూన్‌టు '3', *నాల్‌ ~ నలు, నాల్‌న్ క్కు/నాల్‌న్‌కు '4'

  • చయ్మ్‌-, చయ్మ్‌తు '5', *చాతు '6' *ఎఴ్ '7', *ఎణ్ '8', *తొణ్/తొళ్‌

'9' పత్‌తు, పన్‌-, పత్‌-ఇన్‌- '10'; శతార్థంలో *నూటు అని ప్రా. ద్రా. లో ఉండేది. పై శబ్దాల్లో ఒన్‌-, ఓర్‌ ~ ఒరు, ఈర్‌ ~ ఇరు, మూ-, నాల్‌ ~ నలు విశేషణాలుగానే ప్రయోగించబడేవి. ఒన్‌ - టు, ఇరణ్‌-టు, మూన్‌-టు, నాల్‌ -క్కు, చయ్మ్-తు, లలో చివరి టు, టు, క్కు, తులు అమహత్ప్రత్యయాలు. టు ~ టు ~ తు లు సపదాంశాలు; తు వర్ణం దంతమూలీయ, మూర్జన్య అనునాసికాలకు పరమైనప్పుడు టు, టు లుగా మారటం ప్రా. ద్రా. లోనే జరిగింది.

తెలుగులో 1-7 సంఖ్యావాచకాలను పై ప్రా. ద్రా. రూపాలనుంచి నిష్పన్నం చెయ్యవచ్చు. అపదాది స్పర్శాలు నాదవంతాలు కావటం, పదాది చకార లోపం, న్టు (=న్‌టు) > ణ్డు, ఴ > డ, వర్ణవ్యత్యయం, మొ. మార్పులవల్ల తెలుగు రూపాలేర్పడ్డాయి. ప్రా. ద్రా. *చయ్మ్‌-లో చలోపం, 'అయ్' 'ఏ' గా మారటం, చివరి 'ము' 'ను' గావటంవల్ల ఏను శబ్దం ఏర్పడ్డది; ఐదు (>ఆయ్ మ్‌ _తు <*చయ్మ్‌-తు). బహుశా అనునాసికలోపం అయిన కన్నడరూపం, ఎరువుగా తెలుగులోకి చేరి ఉంటుంది. లేకపోతే ప్రాచీన కావ్యాల్లో 'ఐఁదు/అయిఁదు' అని అరసున్నతో ఉండవలసింది. నన్నయకాలంలోను, అంతకుముందు 'ఏను' రూపమే కనిపిస్తుంది. ఏఁబది (> యాభై) లో ఉన్న మొదటిపదం ఇదే.

తమిళంలో 'పత్తు' కు వికల్పరూపం 'పహ్ తు'. ఇక్కడ 'అయ్‌దమ్‌' అనే వింతధ్వని (హకార సదృశమైనది) కనిపిస్తుంది. బహుశా ఈ కారణంవల్లనే తెలుగు కన్నడాల్లో -ఫై, -భై, -భత్తు, అనే రూపాలు 'పది'కి సపదాంశాలుగా ప్రాచీన కాలంలోనే ఏర్పడ్డాయి. దేశ్య (ద్రావిడజన్య) శబ్దాల్లో మహాప్రాణం ఏర్పడ్డది ఈ పదాంశ౦లోనే.

16.11. సంఖ్యావాచకాలతో చేరే మహత్ప్రత్యయం ప్రా. ద్రా. లో-వర్‌. ఇది తెలుగులో-వురు (>-గురు) గా మారింది, 'ఇద్దఱు' కు పూర్వరూపం