పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/483

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

468 తెలుగు భాషాచరిత్ర

లుగా మారిపోయింది; ఉదా. రాజుల్ల (క్రీ. శ. 600), అణపోతు-లు (క్రీ. శ. 600 - 25) (§§ 3. 31, 4.39; చూ. పైన సూత్రం 11). పూజ్యార్థంలో 'గారు' 12వ శతాబ్ది నుంచి శాననభాషలో ఉంది (§3.39) బహువచన 'ళు/లు' పరమై నప్పుడు ఈ క్రి౦ది సూత్రం ప్రవర్తిస్తుంది.

(28) హ1హ --> హ1/--- లు, ళు

పుట్లు (క్రీ. శ. 633-63), భట్లు (క్రీ. శ. 1043). ఇదిపై నిరూపించిన సూత్రం (5) కు సాధారణీకృత రూపం. 'ళు', 'లు' గా మారకముందే సంధిలో 'రల' లకు మూర్దనత్వం వచ్చింది. ఉదా. ఊడ్లందు (క్రీ. శ. 638-63), మంగడ్ల (క్రీ. శ. 742-98) (§3.32), మూర్దన్య 'ళ్ళు' చారిత్రకంగా వచ్చినా ఇప్పటికీ అలాటి శబ్దాల్లో నిల్చి ఉంది. కాళ్ళు, రోళ్ళు మొ. వి. పై ఉదాహరణల్లో 'డ్లు' రాతలో ఉన్నా ఉచ్చారణ 'ళ్ళు' గానే ఉండవచ్చు. 12, 13 శతాబ్దులదాకా 'డ్లు' రాతలో కనిపిస్తుంది (§4.39). ఇప్పుడు వ్యావహారిక రూపాలుగానే చెలామణి అయ్యే 'నెల్లు, రాత్రిళ్ళు' లాటివి 14వ శతాబ్దినుంచే శాసనభాషలో ఉండేవి (§4.39)

ద్వితీయా విభక్త్యంగ నిర్మాణంలోను, నామవిభక్తుల స్వరూప ప్రయోగాల్లోను 10వ శతాబ్ది దాకా శాసనభాషకు కావ్యభాషకు మధ్య చెప్పుకోదగ్గ మార్పులు లేవు (§§ 3.83-36). 'ను, కు, నన్‌, అన్‌' ల ముందు, ము వర్ణలోపం, పూర్వాచ్చుకు దీర్ఘం, నగాగమం 11వ శతాబ్ధికే ఏర్పడ్డాయి (చూ. సూత్రం 20 పైన). హల్సంధి వచ్చిన ద్వితీయాంత రూపం 18వ శతాబ్దికే ఏర్పడ్డది. ధర్మాన్ని (క్రీ. శ. 1140) (§4.41). 'న' గా గమ(౦తోపాటు) నిగాగమ రూపాలు 13వ శతాబ్దిలో ఉన్నాయి, ఉదా. దీపానకుం (క్రీ.శ. 1292), దీపానికి (క్రీ. శ. 1241) (§4.43) తరవాత నిగాగమరూపాలే వ్యవహారభాషలో స్థిరపడ్డాయి. వలన > వల్న > వల్ల 13వ శతాబ్దిలో ఉంది (§4,44). మహత్తు 'డుణు' తో ద్వితీయావిభక్తి చేరి హల్సంధి వచ్చిన రూపాలు 16వ శతాబ్దికే ఏర్పడ్డాయి. ఉదా. బ్రంహ్మేశ్వరుంణ్ని (క్రీ. శ. 1583). ఈ వాడుక ఈనాటిది గాదని దీన్నిబట్టి నిరూపించవచ్చు. (§5.26). 15, 16 శతాబ్దులకల్లా కరణసహార్థాల్లో 'చేత, తోడ' లే వ్యాప్తిలోకి వచ్చి 'అన్‌, నన్‌ మెయిన్‌', మొ. వి. కావ్యభాషకే పరిమితమైపోయినాయి. (§4.42). 'వల్లనుండి, లోననుండి' మాదిరి సమస్త విభక్తులు 15, 16 శతాబ్దు