తెలుగుభాషా చరిత్ర : సింహావలోకనం 467
రూపాలే ఎక్కువ (§§ 3.25, 4.26). ద్రుతం మీద సరళాదేశం శాసనాల్లో నిత్యంగా కనిపించదు (§ 4.28).
16.9. నామం, నామ విభక్తులు. ప్రా. ద్రా లో మహదమహద్భేదం ఉండేది. పురుషవాచక శబ్దాలు మహత్తు; ఇతరాలు అమహత్తు (చూ. కృష్ణమూర్తి 1974). ఈ నిర్మాణం ఇంకా ద. ద్రా. ద్వితీయశాఖలోను, మధ్య ద్రావిడ భాష ల్లోను నిలిచి ఉంది. స్త్రీ పురుష సమూహాన్ని నిర్దేశి౦చే చోట మహద్బహువచన రూపమే అన్ని ద్రావిడ భాషల్లోనూ ఉంది. ద. ద్రా. I శాఖలో కేవల స్త్రీ సమూ హానికి గూడా 'వారు' వంటి రూపం వాచకమైంది. ఈ మార్పు తెలుగులోనూ కనిపిస్తుంది. తమిళాది ద. ద్రా. భాషల్లో, స్త్రీవాచక ఏకవచనరూపం *అళ్ ఏర్పడ్డది. తొలి తెలుగు దశలో మహద్భహువచన ప్రత్యయం- (అ) రు, -వురు; సామన్య బహువచన ప్రత్యయం *-ళు. ఏకవచనంలో కొద్ది మాటల్లోనే లింగ భోధక ప్రత్యయం చేరేది. మహదర్థంలో '_న్ఱు ' (< ప్రా. ద్రా. *న్‌టు), ఏడో శతాబ్దికే '-ణ్డు'గా మారింది, ఉదా. వాన్ఱు (క్రీ. శ. 600), వాణ్డు (క్రీ. శ. 625- 50) (§ 3.35); ణ్డు లోని అనునాసికం లోపించి పూర్వాచ్చు నాశ్రయించిన అనునాసిక్యంగా 15 వ శతాబ్ది దాకా ఉండి తరవాత లోవించింది, వాణ్ణు > వాఁడు > వాడు. దేవుడికి (క్రీ. శ. 1247) వంటి రూపాల్ని బట్టి 13 వ శతాబ్దినుంచే అనునాసిక్య లోపం మొదలైనట్టు ఊహించవచ్చు. (§ 4.40). మహత్తుల్లో ముకా రా౦తాలు లేవు. కొన్ని ఆప్రాణివాచకాలు *-మ్‌తో అంతమయ్యేవి. ప్రా. ద్రా.
- మ్ తెలుగులోను గా దూరింది. మ్రాను, చేను, కొలను మొ. వాటిలో చివరి
'ను' ప్రా. ద్రా. *మ్ నుంచి ఏర్పడ్డది; చూ. తమిళం మరమ్, కయ్, కుళమ్. ము వర్ణానికి రూపా౦తరాలుగా మ్బు , మ్ము, మ్' లు గూడా శాసనాల్లోను, కావ్యా ల్లోనూ కనిపిస్తాయి. ఉదా. కొట్టంబు (క్రీ. శ. 575-600), దేశము (క్రీ.శ. 650), పురస్సరం (క్రీ. శ. 680) (§ 3.28). బహువచన నామవిభక్తులముందు ఆమహాత్తు 'ము' లోపించి పూర్వాచ్చు దీర్ఘ౦ కావటం 11వ శతాబ్టినుంచే జరిగింది. (చూ. పైన సూత్రం 20).
మహద్బహువచనంలో -రు ప్రత్మయం మొదట వాడుకలో ఉండి తరవాత తగ్గుతూ వచ్చింది. ఉదా. వేవురు (క్రీ. శ. 625-50), మల్లుర (8 వ శతా). (§§ 3.28, 4.38. 6.25), సామాన్య బహువచన ప్రత్యయం-ళు 7వ శతాబ్దికే