466 తెలుగు భాషా చరిత్ర
ధర్మం కాదు, వ్యవధానంతో పలికినప్పుడు రెండు పదాలమధ్య ఉత్వసంధి గూడా నిత్య౦ కాదు. శాసనభాషలో ఈ వైవిధ్యం ఎక్కువగా కనిపిస్తుంది. పదాంత హ్రస్వాచ్చు (అ ఇ ఉ) పరంగా అచ్చుతో మొదలయ్యే పదం వచ్చినప్పుడు, అవ్యవహితోచ్చారణలో లోపిస్తుంది; వ్యవధానం ఉంటే రెండచ్చులూ యధాతథంగా ఉంటాయి. వ్యవధానంలో యడాగమం రావచ్చు. ఉదా. సంధికి : ఊడ్ల౦దు (క్రీ. శ. 663), తమన్న (<తమఅన్న, క్రీ. శ. 1280), మహాదేవైన (క్రీ. శ. 1378), కాంచనంగారనుజుండు (క్రీ. శ. 1482). (§§ 3.24, 4.24, 5.21,). తత్సమ పదాల్లో తెలుగు సంధి క్వచిత్తుగా కనిపిస్తుంది. నీలీశ్వర (§ 3.27) విసంధికి: పన్నస ఇరవది (క్రీ. శ. 600), రేనాణ్డు ఏళన్ (క్రీ. శ. 576- 600), కొట్టరువు ఎఱయమ (క్రీ. శ. 1163), కొలుపు ఒకటి (క్రీ. శ. 1409), (§§ 3.24, 4.24,). యడాగమ వడాగమాలకు: ఇరవదియాదినాల్కు (క్రీ.శ. 600), సత్త్యెరాజు యిచ్చిన (క్రీ. శ. 1152). విచ్చేశివుదయగిరి (క్రీ. శ. 1515), (§§ 3.24, 27, 4.24, 5.21,).
కావ్యభాషలో పరిమిత ప్రవృతి గల అచ్సంధీ సూత్రాలన్నీ ఆధునికభాషలో ఏకసూత్రంగా సులభీకృతమైనాయి.
(27) అ --> Ø |... -- # అ/ ఆ
పదాంత హ్రస్వాచ్చు ఏదైనా (అ = ఆ, ఇ, ఉ, ఎ), పరపదాద్యచ్చు ముందు సంహితలో లోపిస్తుంది. 15, 16 శతాబ్దుల కావ్యభాషలోనే ఈ సూత్రం వరర్తిస్తు న్నట్టు ఆధారాలున్నాయి; ఉదా. ఇన్నని, నాగవల్లట (§ 8.1). సంధివశాన ఇ + అ ---> ఎ, ఇ + ఆ --->ఏ నాలుగైదు శతాబ్ధుల కిందటే జరిగిఉంటుంది. మెంతాకు, ఏటావల, మోవాన వలదె, మొ. చోట్ల వచ్చిన అచ్చు వివృత ఏకారమై ఉంటుంది (చూ. పైన సూత్రం 24). హల్సంధులు గూడా నేటి ప్రమాణ భాషలో ఉన్నట్లుగానే 15, 16 శతాద్ధుల కావ్యాల్లో కనిపిస్తాయి (§ 8.12-13), ఉదా. అడుక్కొని, ఇంట్లోకి, ముప్పది రె౦డ్రాగములు, రెణ్ణేల్లు , నెల్లాళ్ళలో (చూ. § 13.6). ప్రథమ మీద గసడదవాదేశం ప్రాచీన కావ్యభాషలో నిత్యంగా కనిపిస్తున్నా శాసనభాషలో వైకల్నికంగానే ఉండేది. ఇది గూడా ఉచ్చారణ వ్యవ ధానాన్ని బట్టి ఉంటుంది. 8-11 శతాబ్దులలో శాసనాల్లోనూ గసడదవలు వచ్చిన