Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/480

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తెలుగుభాషాచరిత్ర : సింహావలోకనం 465

(25) దీర్ఘాచ్చు + య --> హ్రస్వాచ్చు + య్య

అకారేతర ధాతు గతాచ్చుకు య పరంగా ఉన్నచోట్ల పై సూత్రం వర్తిస్తుంది. దీనికి ఆధారాలు 15వ శతాబ్ది నుంచి వాడుక భాషలో కనిపిస్తాయి, ఉదా. పొయ్యం గలారు (క్రీ. శ. 1403), ఇయ్యం గలారు (క్రీ. శ. 1408), చెయ్యక (క్రీ.శ. 1585) (§ 5.14).

(26) వ --> Ø / # _ తాలవ్యాచ్చు

తెలుగులో పదాది వకారం అ ఆ, ఇ ఈ, ఎ ఏ ల ముందే వస్తుంది. ఇ ఈ, ఎ ఏ ల ముందు వకారలోపం నేడు పామరభాషలో వినిపిస్తుంది. వెండి, వేడి, విల్లు, వీధి > యెండి, యేడి, యిల్లు, యిది. ఈ మార్పు శాసన రచనలో 15 శతాబ్దికే ఉన్నట్టు తెలుస్తున్నది; ఉదా. ఇండ్లు < విండ్లు (క్రీ.శ. 1403), ఎలుంగను < వెలుంగను (క్రీ.శ. 1416) (§ 5.17). ఇది పామర వ్యవహారమని కేతన (§ 7.10, 5).

16.7. ఒ/వల మార్పు గూడా 17వ శతాబ్ది నుంచే ఉంది, ఉదా. వద్దు/ఒద్దు, ఒక/వక (§ 6.8(b)). హ్మ, హ్న లను మ్హ, న్హ లుగా ఉచ్చరించటం 12వ శతాబ్ది నుంచి కనిపిస్తుంది. ఉదా. బ్రా౦హలు, వన్హి (§ 6.8(I), థ/ధ ల భేదం 17 వ శతాబ్దికే నశించింది, ఉదా. పృథివి, అర్ధసమస్య (§ 6.9(b); ఇది ప్రాఙ్నన్నయ కాలంలోనే మొదలైంది (§ 7.10, 8). తత్సమాల్లో 'ఋ' వర్ణాన్ని తెలుగులో మొదటినుంచీ రి/రు గానే ఉచ్చరించేవాళ్ళు. ఉదా. రిషభ (క్రీ. శ. 1158), ప్రుదివి (క్రీ. శ. 1259), నన్నయ ఋ/రి యతిని, తిక్కన ఋ/రు యతిని పాటించారు (§§ 4, 7, 5. 4, 7, 5, 1). అచ్చుల మధ్యన మకారాన్ని అనునాసిక వకారంగా ఉచ్చరించటం 17 వ శతాబ్దికే కనిపిస్తుంది, ఉదా. మావిడి (§ 6.8 (f)). అరబ్బీ, పారశీకాల ప్రభావంవల్ల అన్యదేశాల్లో f,x,y,z మొ. కొత్త ధ్వనులు తెలుగులో చేరాయి. కాని వీటిని ఎప్పటినుంచి ప్రత్యేక వర్ణాలుగా ఉచ్చ రించేవారో మనకు తెలియదు. (§6.8(f), § 8.3). 'f' ను 'ఫ' గ రాస్తున్నా 16 వ శతాబ్ది తరవాత కొందరైనా దాన్ని ప్రత్యేకవర్ణ౦గా పలికి ఉంటారు.

16.8. సంధి. సంధి ప్రకియలో కావ్యభాషకు వ్యవహారభాషకు తేడాలు మొదటినుంచి కనిపిస్తున్నాయి. సంధి ఉద్బారణకు సంబంధించిన ధర్మం; లేఖన

(30)