464 తెలుగు భాషా చరిత్ర
వర్ణసిద్ధి లేదు. శాసనాల్లో ఇవి కలిసిన రూపాలు కలవని రూపాలు గూడా అన్ని శతాబ్ధులోనూ కనిపిస్తాయి; ఉదా. కొట్టరువు ఎఱియమ (క్రీ.శ. 1168) (§§ 3.26, 4.24, 5.5).
(22) “చ” --> "ౘ” /
-జ- ౙ /
--- తాలవ్యేతరాచ్చు
అ ఆ ఉ ఊ ఒ ఓ ల ముందు చే జే అని ఇ ఈ ఎ ఏ ల ముందు చ జ అని ఈనాడు ప్రమాణభాషలో ఉన్న ఉచ్చారణ 11వ శతాబ్ది నుంచే గుర్తించినట్టు ఆధారా లున్నాయి. /చ ౘ/ లు /జ జే/ లు సవర్ణాలు. వాటిని ప్రత్యేక సంకేతాలతో సూచించ నక్కరలేదు. దంత్యోచ్చారణ నిర్దేశించటానికి 'త్స', తాలవ్యోచ్చారణకు 'ఎత్వం' కలిపి రాయటమూ ఈ భేదం ఉన్నదనటానికి ఆధారం; ఉదా. మొడత్స (క్రీ.శ. 1018), పత్సలు (? 14శతా), పుత్సుకొని (క్రీ.శ. 1393), ఆ చె౦ద్రాక౯ స్థాయి (క్రీ.శ. 1697) (§§ 3.4, 5.2-3. 11, 6.4, 18). స,శ ల ఉచ్చారణ గూడా నేటి తెలుగులాగా తారుమారుగావటం 14, 15 శతాబ్దుల్లోనే మొదలై ఉంటుంది; ఉదా. సెనివారానను (క్రీ. శ. 1418), స్యూదృలు (క్రీ. శ. 1692), శెంఖు, మొ. వి. తత్సమపదాల్లో 'చ' ను 'చె' గానే ఉచ్చరించేవారు ఉదా. హరి శ్చెంద్ర (క్రీ.శ. 1596), ఆ చెంద్రార్క (క్రీ. శ. 1503) (§ 5.2, 3).
(23) న --> శ/ -- తాలవ్యాచ్చు.
పడశిన (క్రీ.శ. 1273), చేశిన (క్రీ.శ. 1290), చేశెను (క్రీ. శ. 1494, శావ (క్రీ. శ. 1574) (§§ 4.18, 5.18, 6.28(g)) ఈనాటి ఉచ్చారణకు ఏడు శతాబ్దుల చరిత్ర ఉందనీ పై ఉదాహరణలవల్ల తెలుస్తుంది.
(24) ఏ --> ఏ/ #__హ అ
పరాక్షరంలో అత్వం ఉన్నప్పుడు ధాతుగత 'ఏ' వర్ణం ఉచ్చారణలో వివృతమై ఏ ('Cat' లో ఉన్న అచ్చులాగాా) అవుతు౦ది. ఇది 15, 16 శతాబ్ధుల శాసన రచనల్లో కనిపిస్తుంది. ప్రత్యేక వర్ణత్వం లేకపోవటంవల్ల 'యా' గాను, కొన్ని చోట్ల 'ఆ' గాను ఇది రాతలో సూచించబడ్డది ; ఉదా. పండితుల చాత (క్రీ.శ. (9546), (< సేవ; క్రీ. శ. 1574), మ్యేరకు (క్రీ.శ. 1638) (§§ 5.8. 6.8(c)). పళ్యాలు (క్రీ. శ. 1518) పదాన్ని ఈనాడు కోస్తా జిల్లాల్లో ఉచ్చరి౦చి నట్లు (పళ్ ళేేలు ఆని) ఉచ్చరించి ఉండవచ్చు (§ 5.7).