Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/478

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తెలుగుభాషచరిత్ర : సింహావలోకం 462

(19) డ --> ళ / # . . . _ + "ల . "ళ

బహువచన ళు(= లు) ప్రత్యయం పరమైనప్పుడు పూర్వాన ఉన్న 'డ' వర్ణం అజ్లోపంతో 'ళ' వర్ణంగా మారుతుంది, గుడి + లు > గుడ్లు (7 వ శతాబ్ధి) > గుళ్ళు (క్రీ.శ. 1381). రాతలో 'డ్లు' రాసినా 'ళ్ళు' గానే ఉచ్చరించేవారేమో మనకు తెలియదు; కాని శాసనాల్లో 'ళ్ళు' రాయటం 12వ శతాబ్దితరవాత ప్రచు రంగా కనిపిస్తుంది (§§ 3.32 4.28, 5.21).

(20) అం --> ఆ / # . . . - + "ళు “లు "న

బహువచన ళు/లు, ఆగమనవర్ణం పరమైనప్పుడు విశేషాల చివరి అం (= అము), ఆ గా మారుతుంది. నరకా - నం (క్రీ. 1008), భోగా-నకు (క్రీ.శ. 1060), కుంచా-లు (క్రీ.శ. 1038) వర్షా-లు (క్రీ.శ. 1091). ఈ మార్పు శాసనభాషలో 11న శతాబ్దినుంచి కనిపిస్తున్నా అంతకుముందే (9/10 శతా.) మొదలై ఉంటుంది. ఇదిగూడా ఉచ్చారణలో వచ్చిన మార్పే. పుస్తకములు, వర్షములు లాటి రూపాలు 10 శతాబ్ధులకు ముందే ఇప్పటి భాషలోలాగా పుస్తకాలు పుస్తకానికి, వర్షాలు, వర్షానికి లాగా మారిపోయినట్లు గుర్తించవచ్చు (§ 3.32). ఇది నేటిభాషకు కూడా వర్తించే సంధి సూత్రం.

12 వ శతాబ్ది తరవాత కేవలం ఉచ్చారణకు సంబంధించిన మరికొన్ని మార్పులు శాసనరచనలో కనిపిస్తాయి. వీటివల్ల వర్ణనిర్మాణంలో భేదం అట్టెరాదు. పై నిరూపించిన మార్పులను phonemic changes అంటారు; కింద నిరూపించేవి phonetic changes మాత్రమే.

(21) Ø --> "య/ "వ/ # _ -ఇ- -ఎ- -ఉ- -ఒ-

ఉచ్చారణలో పదాది తాలవ్యాచ్చులముందు 'య', ఓష్ట్యాచ్చులముందు 'వ' చేరటం మొదటినుంచీ దక్షిణ ద్రావిడ భాషల్లో కనిపిస్తుంది; ఉదా. యేళు (క్రీ.శ. 719- 20), వుద్దిని (క్రీ. శ. 972). తెలుగు మాటల్లో ఈ స్థానంలో పదాదియవలకు