పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/468

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తెలుగు భాషా చరిత్ర : సింహావలోకనం 453

  • చువర్‌ దక్షిణ ద్రావిడోప కుటుంబంలో *చొవర్‌గా మారింది. పదాది చ వర్ణం

ఈ భాషల్లో కొన్ని శబ్దాల్లో లోపించింది (చూ. సూత్రం 2). పై మాతృకల జన్యరూపాలు రెండు శాఖల్లోనూ ఈ కింది విధంగా ఉన్నాయి.

I. (a) త. మ. క. తె. ఉప్పు ; కొ, ఉప్ పు; తు.ఉప్పు; కోత, తొద ఉప్.

(b) త. ఉవర్, మ. ఉవర్‌, ఓర్‌; క. ఒగర్; తు, ఉబరు, ఉగరు; తె. ఒగరు. (త. మ.తు. ఉ-< ఒ -: § 2.12)

II. గోం. సొవర్, హోవర్, ఓవర్‌; కొండ సోరు, పెంగొ హోర్; కూయి సారు, కువి హారు, మండ జార్‌.

మధ్య ద్రావిడ భాషల్లో: ప. చుప్, కోలామీ సుప్, నాయ సుప్ప్-, ఒల్లారి సుప్, గదబ చుప్పు.

అత్వపరంగా ఉకారం ఒకారంగా మారటం ద. ద్రా. శాఖల్లో స్పష్టంగా గుర్తించవచ్చు. *చుప్ + అర్‌ > *చుపర్‌ జన్యరూపాలు మధ్యద్రావిడ భాషల్లో కనిపించవు.

(2) (a) చ > స/# -

(b) స > హ/# -

(c) హ > Ǿ/# -

ఈ మూడు సూత్రాలు ద. ద్రా. శాఖల్లో ముందు వెనకలుగా ప్రవర్తిస్తాయి. పదాది చకారం మాండలికంగా (ప్రాంతీయ వర్గ మాండలికాల్లో) సకారంగా మారి నప్పుడు, అది హకారంగా మారి ఆ తరవాత లోపిస్తుంది. ఈ మార్పు ద. ద్రా. భాషల్లో మొదటి శాఖలో పూర్తిగా ప్రవర్తించి రెండో శాఖకు వ్యాపిస్తున్న కాలంలో అది విడిపోయి ఉంటుంది. కూయి-గోండి ఉపశాఖలో ఈ మార్పులు ఇప్పటికీ నడుస్తున్నాయి. అందువల్లనే గోండిలో 'సోవర్‌, హోవర్‌, ఓవర్‌' మూడు రూపాలూ కనిపిస్తాయి. ఈ సూత్రాల ప్రవృత్తి మధ్యద్రావిడ భాషల్లో కనిపించదు.

ద్రావిడ మాతృకలోలేని పదాది మూర్ధన్య దంతమూలీయ వర్ణాలు, సంయుక్త హల్లులు వర్ణవ్యత్యయం కారణంగా తెలుగు - కూయీ శాఖలో ఏర్పడ్డాయి (§ 2.13). దీని చాయలు తమిళ -కన్నడ శాఖలోనూ కనిపిస్తాయి.